Begin typing your search above and press return to search.

అతడు రిసెప్షన్‌ కు రాకపోవడం పై దీపిక కామెంట్‌

By:  Tupaki Desk   |   19 Dec 2018 1:30 AM GMT
అతడు రిసెప్షన్‌ కు రాకపోవడం పై దీపిక కామెంట్‌
X
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపిక పదుకునే తాజాగా బాలీవుడ్‌ హీరో రణ్‌ వీర్‌ సింగ్‌ ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. వీరి వివాహ రిసెప్షన్‌ బెంగళూరు తో పాటు ముంబయి లో కూడా జరిగిన విషయం తెల్సిందే. పెళ్లి రిసెప్షన్‌ అత్యంత వైభవం గా జరగడం తో పాటు బాలీవుడ్‌ ప్రముఖులు మరియు రాజకీయ ప్రముఖులు అంతా కూడా పాల్గొన్నారు. అయితే ఈ వేడుక లో రణబీర్‌ కపూర్‌ మాత్రం హాజరు కాలేదు.

అందరితో పాటు అతడిని కూడా తన వివాహ రిసెప్షన్‌ కు పిలిచాను అని, కాని అతడు రాలేదు. అతడి వ్యక్తితమే ఇలా ఉంటుంది, అతడు రాడనే తాను భావించానంది. అతడి వ్యక్తిత్వం అదే అని, అతడి గురించి పెద్ద గా ఆలోచించడం లేదని చెప్పుకొచ్చింది. రణ్‌ వీర్‌ సింగ్‌ ను ప్రేమించడానికి ముందు దీపిక పదుకునే రణబీర్‌ కపూర్‌ తో ప్రేమ లో మునిగి తేలిన విషయం తెల్సిందే. ఇద్దరు దాదాపు మూడు సంవత్సరాల పాటు తెగ ప్రేమించేసుకున్నారు. కాని ఇద్దరు కూడా ఏదో కారణంగా విడిపోయారు.

విడిపోయిన తర్వాత తన పెళ్లి కి మాజీ బాయ్‌ ఫ్రెండ్‌ ను దీపిక పిలిచింది. కాని అతడు మాత్రం ఆ కార్యక్రమం లో హాజరు అయ్యేందుకు ఆసక్తి చూపించలేదు. ఇక దీపిక మరియు కత్రీనాల మద్య వివాదం ఉందని కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా పెళ్లితో అవన్ని కూడా పోయాయి. పెళ్లి రిసెప్షన్‌ లో కత్రీనా పాల్గొనడమే కాకుండా రాత్రంతా కూడా డాన్స్‌ లు చేస్తూనే ఉందట. ఈ విషయాన్ని స్వయంగా దీపిక చెప్పుకొచ్చింది.

దీపిక నుండి విడిపోయిన తర్వాత రణబీర్‌ కపూర్‌ కొన్నాళ్లకే కత్రీనాతో ప్రేమాయణం సాగించాడు. ఆమెతో విడిపోయిన ఈ హీరో ప్రస్తుతం ఆలియా భట్‌ తో ప్రేమలో ఉన్నాడు. త్వరలోనే వీరిద్దరి పెళ్లి అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌ వర్గాల్లో వీరిద్దరి గురించి తెగ చర్చ జరుగుతోంది.