Begin typing your search above and press return to search.

చిట్టిబాబుకి అన్యాయం జరిగిందా

By:  Tupaki Desk   |   10 Aug 2019 9:09 AM GMT
చిట్టిబాబుకి అన్యాయం జరిగిందా
X
నిన్న జాతీయ అవార్డులు ప్రకటించాక తెలుగు సినిమాలు నాలుగు పురస్కారాలు పొందటం పట్ల సోషల్ మీడియాలో ఒక పక్క ఆనందం వ్యక్తమవుతూనే మరోపక్క రంగస్థలం సినిమాకు కేవలం సౌండ్ విభాగంలో మాత్రమే అవార్డు ఇవ్వడం పట్ల మెగా ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందాధున్ లో ఆయుష్మాన్ ఖురానా యుఆర్ఐలో విక్కి కౌశల్ కన్నా ఏ కోణంలో రామ్ చరణ్ నటన తక్కువగా కనపడిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అందులోనూ చిలసౌకు బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు ఇవ్వడం పట్ల కూడా చర్చ జరుగుతోంది.

వీటి సంగతి ఎలా ఉన్నా నిజంగానే రంగస్థలంని అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన అంశాలు కొన్ని ఉన్నాయి. చరణ్ నటన - సుకుమార్ స్క్రీన్ ప్లే దర్శకత్వం - ఆర్ట్ వర్క్ - సంగీతం ఇలా కీలక విభాగాల్లో స్పష్టమైన నాణ్యతను చూపబెట్టే కేవలం కమర్షియల్ హిట్ గానే కాగా రంగస్థలంని ఒక బెస్ట్ విజువల్ ఎక్స్ పీరియన్స్ గా భావించారు ఆడియన్స్. అందుకే బ్రహ్మరధం పట్టారు కాని జాతీయ అవార్డు కమిటీకి ఇవన్ని కనిపించకపోవడం విచిత్రం. చెవులు సరిగా వినిపించకుండా రామ్ చరణ్ అభినయించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఇప్పటికీ టీవీలో వచ్చిన ప్రతిసారి చరణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రేక్షకులు సైతం ఓ కొత్త అనుభూతికి లోనవుతూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే రంగస్థలం విశిష్టతలు చాలానే ఉన్నాయి కాని రావలసిన గుర్తింపు రాలేదన్నది వాస్తవం. కేవలం సౌండ్ కి మాత్రమే గుర్తింపు దక్కడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. కొందరు నెటిజెన్లు రంగస్థలంకు నంది అవార్డు రాకపోయినా ఆశ్చర్యం లేదని తెరవెనుక లాబీయింగ్ నిర్మాతలకు తెలియకపోవడం వల్లే ఒక్కటే దక్కిందని కామెంట్స్ చేయడం గమనార్హం