Begin typing your search above and press return to search.

చైసామ్ ఎందుకు సైలెంట్ అయ్యారు ?

By:  Tupaki Desk   |   27 March 2019 10:48 AM GMT
చైసామ్ ఎందుకు సైలెంట్ అయ్యారు ?
X
ఇంకో పది రోజుల కంటే తక్కువ వ్యవధిలో మజిలి విడుదల కానుంది. ఎన్నికల నేపధ్యంలో వాయిదా పడవచ్చేమో అన్న ఊహాగానాలకు బ్రేక్ వేస్తూ నిర్మాణ సంస్థ స్వయంగా ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంకా సెన్సార్ పూర్తి కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇంత తక్కువ టైం చేతిలో ఉన్నప్పటికీ మజిలి టీం నుంచి ఆశించిన జోష్ కనిపించడం లేదు. నాగ చైతన్య సమంతాలు కలిసి ఓ రెండు మూడు ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చేసి వెంకటేష్ కూతురి పెళ్లికి వెళ్ళిపోయారు.

ఇప్పుడు తిరిగి వచ్చినా దాని మీద ఫోకస్ పెడతారని చెప్పలేం. అయితే రిలీజ్ ఇంత దగ్గరగా ఉన్న కీలకమైన తరుణంలో జనాన్ని ఎలక్షన్ల మూడ్ నుంచి థియేటర్ కు వచ్చేలా చేయాలంటే ఈ జోష్ సరిపోదు. అంతకుమించి ఏదో ఇవ్వాలి. స్టార్ హీరోనా చిన్న వాడా అనే లెక్కలు ఇప్పుడు లేవు. పబ్లిసిటీ చాలా ముఖ్యం. ఫస్ట్ డే హౌస్ ఫుల్స్ కావడంతో పాటు పాజిటివ్ టాక్ బయటికి రావాలి

కాని మజిలి విషయంలో ఆ దూకుడు కనిపించడం లేదు. కాస్త ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదో త్వరగా పెట్టినా బాగుండేది. అదీ ఇంకా జరగలేదు. ఈ నేపధ్యంలో మజిలి టీం కాన్ఫిడెన్స్ కొద్ది ఇలా ఉందా లేక మరేదైనా కారణమా అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం కాని టీజర్ కు మ్యూజిక్ కు వచ్చిన రెస్పాన్స్ ని ఇంకాస్త పెంచాల్సిన అవసరం అయితే ఉంది. ట్రైలర్ వదల్లేదు. సోషల్ మీడియాలో హడావిడి కనిపించడం లేదు.

అక్కినేని ఫ్యాన్స్ సైతం ఏప్రిల్ 5 అని గట్టిగా చెప్పేశారు కదా ప్రమోషన్ వేగాన్ని పెంచండి అని కోరుతున్నారు. కాని ప్రస్తుతానికి రెస్పాన్స్ అయితే లేదు. కంటెంట్ ఎంత ఉన్నా జనానికి చేరాలి అంటే ఇంకాస్త బలంగా తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది. మరి మజిలి టీం ఇది గుర్తించి రంగంలోకి దిగడం బెటర్