Begin typing your search above and press return to search.
మామ బర్త్ డే వేడుకలకు సామ్ అందుకే వెళ్లలేదా..?
By: Tupaki Desk | 30 Aug 2021 3:30 PM GMTగత కొన్ని రోజులుగా సమంత అక్కినేని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సామ్ తన ఇన్స్టాగ్రామ్ - ట్విట్టర్ ఖాతాలలో 'అక్కినేని' అనే పేరు తొలగించిన్నప్పటి నుంచి ప్రతీరోజూ వార్తల్లో నిలుస్తూ ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య - సమంతల మధ్య విభేదాలు తలెత్తాయని.. మనస్పర్థల కారణంగా ఈ స్టార్ కపుల్ విడిపోతున్నారని వార్తలు వినిపించాయి. ఇప్పటి వరకు ఆ వార్తలపై అక్కినేని కుటుంబం స్పందించలేదు.
సామాజిక మాధ్యమాల్లో 'అక్కినేని' పేరు తొలగించడం పై సామ్ మాట్లాడింది కానీ క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై సోషల్ మీడియాలో బాగా.డిస్కషన్ జరుగుతోంది. దానిపై నేను స్పందించాలని అనుకోవడం లేదు. ఇప్పుడే కాదు ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ విడుదలైన సమయంలోనూ నాపై విమర్శలు వచ్చాయి. దానిపై స్పందించమని సుమారు 65 వేల ట్వీట్లు వచ్చాయి. కానీ నాకు సమాధానం చెప్పాలని అనిపించలేదు. అలాంటి విషయాలపై నాకు మాట్లాడాలనిపిస్తేనే మాట్లాడతా అని సమంత ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
అయితే ఆదివారం సమంత మామ కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఒక్క ట్వీట్ తో అక్కినేని ఫ్యామిలీకి దూరం అవుతున్నారనే పుకార్లను పటాపంచలు చేసేసింది. 'మీ మీద నాకున్న గౌరవాన్ని వ్యక్తం చేయటానికి మాటలు సరిపోవు మామ' అంటూ నాగ్ కు సామ్ బర్త్ డే విషెస్ అందించింది. దీంతో చై-సామ్ విడిపోవడం లేదని అభిమానులు ఖుషీ అయ్యారు. అయితే నాగార్జున బర్త్ డే సెలబ్రేషన్స్ లో అక్కినేని కోడలు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
నాగ్ తో కలిసి సతీమణి అమల - కొడుకులు నాగ చైతన్య - అఖిల్ దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో సమంత లేకపోవడంపై నెటిజన్స్ సందేహాలు వ్యక్తం చేశారు. ఫ్యామిలీ అందరూ పాల్గొనే వేడుకలో లేకపోవడాన్ని ప్రశ్నించారు. అయితే సామ్ షూటింగ్ లో బిజీగా ఉండటం వల్లనే పార్టీకి హాజరు కాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి - నయనతార లతో కలసి సమంత ఓ సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. పుదుచ్చేరిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ కారణంగానే మామ పుట్టిన రోజు వేడుకల్లో కనిపించలేదని.. అయినా సామ్ పెట్టిన ట్వీట్ తోనే దీనిపై క్లారిటీ వచ్చిందని ఫ్యాన్స్ అంటున్నారు. ఏదేమైనా చై - సామ్ దీనిపై స్పందించే వరకు ఈ రూమర్స్ కు చెక్ పడేలా కనిపించడం లేదు.