Begin typing your search above and press return to search.
గంగూభాయి ఆఫర్.. దీపికను కాదని ఆలియాకు!
By: Tupaki Desk | 6 March 2022 11:41 AM GMTసంజయ్ లీలా భన్సాలీ `గంగూబాయి కతియావాడి`లో గంగూబాయి పాత్రతో అలరించింది అలియా భట్. ఈ చిత్రానికి అలియా ఖరారు కావడానికి ముందే చాలా పేర్లు వినిపించాయి. వాటిలో ఒకటి దీపికా పదుకొనే. దీనిపై బలమైన పుకార్లు ఉన్నాయి. దీపిక లేదా ప్రియాంక చోప్రా ఇద్దరినీ పాత్ర కోసం పరిశీలిస్తున్నారని ప్రచారమైంది. కానీ ఆఖరికి అది అలియా దగ్గరికి వెళ్లింది.
ఇప్పుడు దీనికి అలియాను నేరుగా అడిగేస్తే.. దీపికను ఎన్నుకోవడానికి కారణమేమిటని అడిగినప్పుడు భన్సాలీ వద్ద స్పష్టమైన సమాధానం ఉంది. ``వీళ్లు వేర్వేరు వ్యక్తులు.. భిన్నమైన వ్యవహారశైలి.. విభిన్నమైన ఎత్తు వర్ణం కలిగి ఉన్నవారు. ఆ గొంతులు.. బాడీ లాంగ్వేజ్ వేరు.. సినిమాల తీరు వేరు.. అన్నీ కలిపితే కుదరదు... దీపికా అందమైన అమ్మాయి.. అద్భుతమైన నటి. అలాగే అలియా చాలా అందమైన అమ్మాయి.. అలాగే అద్భుతమైన నటి. నా ఛాయిస్ ఆలియా అయ్యింది.. ఈసారి మార్పు కోసం`` అని భన్సాలీ అన్నారు.
కానీ నేను బాజీరావు మస్తానీ చేయాలంటే దీపిక ఉండాలి. నేను గంగూబాయి చేస్తే ఆలియా నటించాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక పాత్ర దొరికినప్పుడు వారు చెప్పే శక్తి వేరుగా ఉంటుంది. వారికి సరిపోతుంది. రాంగ్ కాస్టింగ్ ని ఎంపిక చేయలేం.. అని కూడా అన్నారు.
దీనికి ముందు సల్మాన్ ఖాన్ - అలియా భట్ లతో భన్సాలీ ఇన్ షాల్లా తెరకెక్కిస్తారని ప్రచారమైంది. ఈ చిత్రంపై ప్రకటన విపరీతమైన సంచలనాన్ని సృష్టించింది. అయితే ఖాన్ - సంజయ్ ల మధ్య ఉన్న సృజనాత్మక విభేదాల కారణంగా ఈ చిత్రం చివరికి నిలిపివేశారు. సల్మాన్ చాలా ప్రియమైన స్నేహితుడు.. నేను పద్మావత్ తర్వాత అతనితో కలిసి పని చేయాలనుకున్నాను.
అది జరగడానికి నేను నా ఉత్తమమైన అడుగులు వేసాను. కారణాలేవైనా అది ముందుకు సాగలేదు. మనమందరం మనుషులుగా మారాము. కాబట్టి అతను మారిపోయాడు. అతని మనస్సులో నేను మారిపోయాను అని భన్సాలీ ఒక ప్రముఖ మీడియాతో అన్నారు. అన్నట్లు ఆలియా ఎంపిక రాంగ్ అంటూ ఇంతకుముందు క్వీన్ కంగన విమర్శించిన సంగతి తెలిసిందే.
కానీ ఇప్పుడు భన్సాలీ.. గంగూభాయి పాత్రకు ఆలియాను ఎంపిక చేయడమే కరెక్ట్ అని అన్నారు. ప్రేక్షకులకు కూడా మూవీని చూశాక దీనిని అంగీకరించారు. అంతేకాదు.. ఆలియాను కూడా గంగూభాయి రిలీజ్ అనంతరం కంగన పొగిడేయడం షాకిచ్చింది.