Begin typing your search above and press return to search.
నిరుపేద ఓలా డ్రైవర్ పై అంత కోపం ఎందుకమ్మ!
By: Tupaki Desk | 6 Oct 2021 2:30 PM GMTతెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన సంజన గల్రాని ఈమద్య కాలంలో రెగ్యులర్ గా వివాదాలతో మీడియాలో ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె రెగ్యులర్ గా పాజిటివ్ లేదా నెగటివ్ విషయాలతో వైరల్ అవుతూనే ఉంది. ఆమద్య డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి వచ్చిన సంజన ఆ తర్వాత పలు సందర్బాల్లో వివాదాస్పందంగా వ్యవహరించింది అంటూ ఆమెను జనాలు ట్రోల్స్ చేశారు. తాజాగా మరోసారి తన ఫ్రస్టేషన్ ను ఒక నిరుపేద అయిన ఓలా క్యాబ్ డ్రైవర్ పై చూపించింది. అతడిపై తన పరుష పదజాలంను వినియోగించి ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించింది. అతడి తప్పు ఏమీ లేకున్నా కూడా సంజన తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టింది. ఆ విషయాన్ని క్యాబ్ డ్రైవర్ వీడియో తీశాడు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సంజన బెంగళూరులోని ఇందిరా నగర్ నుండి రాజేశ్వరి నగర్ కు క్యాబ్ బుక్ చేసింది. క్యాబ్ బుక్ చేసి రైడ్ మొదలు అయిన తర్వాత తాను వెళ్లాలనుకుంటున్న ప్రదేశం మార్చాలని కోరింది. అందుకు డ్రైవర్ కస్టమర్ కేర్ కు కాల్ చేసి సాధ్యమేనా అంటూ ప్రశ్నించగా అది సాధ్యం కాదని చెప్పారట. దాంతో ఆమె బుక్ చేసిన రాజేశ్వరి నగర్ కు తీసుకు వెళ్లి వదిలాడు. రాజేశ్వరి నగర్ కు చేరుకున్న తర్వాత సంజన తీవ్ర స్థాయిలో అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసిందట. అతడిని బూతులు తిడుతూ అతడి తీరును తీవ్రంగా ఆక్షేమించింది. కారును డబ్బా కారు అంటూ పదే పదే అసంతృప్తి వ్యక్తం చేస్తూ అతడిపై రచ్చ చేసిందట. అదే విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ ఓలా క్యాబ్ ను ట్విట్టర్ లో ట్యాగ్ చేసింది.
డ్రైవర్ తనతో ప్రవర్తించిన తీరును.. అతడి కారును ఓలాకు ఫిర్యాదు చేసింది. ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. ఇలా డబ్బా క్యాబ్ లు పంపిస్తే ఎలా అంటూ సంజనా అసంతృప్తిగా వ్యాఖ్యలు చేసింది. ఓలా క్యాబ్ డ్రైవర్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారులో ఉన్న సమయంలోనే 100 కు కాల్ చేసి పోలీసులకు ఓలా డ్రైవర్ గురించి ఫిర్యాదు చేసింది. క్యాబ్ డ్రైవర్ తనను మానసికంగా హింసించే ప్రయత్నం చేశాడు అంది. డ్రైవర్ మాత్రం తాను ఏ తప్పు చేయలేదు. తనను ఆమె బూతులు తిట్టింది అంటూ తన వద్ద ఉన్న వీడియో ప్రూఫ్ ను చూపించాడు. మరో వైపు సంజన కారు ఫొటోలు షేర్ చేసి ఇంత డబ్బా కారుకు కూడా మీరు అంత అమౌంట్ వసూళ్లు చేస్తున్నారు అంటూ ఓలాను విమర్శించింది. మొత్తానికి ఒక డ్రైవర్ తో సంజన గొడవ వ్యవహారంను కొందరు చీప్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు మాత్రం సంజన ఇలా చేయడం బాగాలేదని కామెంట్స్ చేస్తున్నారు.