Begin typing your search above and press return to search.

రమ్యకు 2.5 కోట్లు.. శ్రీదేవి 5 కోట్లు

By:  Tupaki Desk   |   9 May 2017 5:59 AM GMT
రమ్యకు 2.5 కోట్లు.. శ్రీదేవి 5 కోట్లు
X
బాహుబలి లో శివగామి మాటకు ఎంత విలువ ఉందో చూసారు కదా. వీరుడైనా రణరంగ శూరుడైనా అమ్మ మాట వినవలిసిందే. అమ్మ మాటతోనే కథ ముందుకు సాగుతుంది. అటువంటి పాత్రలో రమ్యకృష్ణ చేసిన నటనకు దేశ విదేశాలలో ప్రశంశల హోరు అంతాఇంతా కాదు. రమ్యకృష్ణ అద్భుత నటన బాహుబలి విజయంలో ఒక సమిధలా ఉపయోగపడిందని చెప్పవచ్చు.

అటువంటి పాత్రకు మొదట ఎంపిక చేసుకుంది రమ్యకృష్ణను కాదు శ్రీదేవిని అని మీకు తెలుసు కదా. అసలు శ్రీదేవి ఒప్పుకోకపోవడానికి కారణం ఏమి అనుకున్నారు. ఈ సినిమా కథ విన్నపుడు శ్రీదేవికి కూడా బాగానే నచ్చిందట. కాకపోతే బాహుబలి భారీ సినిమా కావడంతో బడ్జెట్ కూడా ఎక్కువే అటువంటి స్థితి లో శ్రీదేవి అడిగిన ఫీ ఇచ్చుకోలేము అన్నారట బాహుబలి టీమ్. రమ్యకృష్ణ ఈ సినిమాకి 2.5 కోట్లు తీసుకొంటే శ్రీదేవి దానికి డబుల్ అడిగిందట. దానితో బాహుబలి రమ్యకృష్ణని ఫిక్స్ చేసేసారూ. అలా చేయడం కూడా ఒకరకంగా మంచిదే అయ్యిందిలే. శివగామి పాత్ర లో అంతగా జీవించి చేశారు రమ్యకృష్ణ.

బాహుబలిలాంటి గొప్ప సినిమా అవకాశం వదులుకున్న శ్రీదేవిని చూసి చాలామంది జాలి చూపారు. నిజమే 1000 కోట్లు బాక్స్ ఆఫీసు కలెక్షన్లు మరి. శ్రీదేవి ఇప్పుడు మామ్ అనే థ్రిల్లర్ మూవీతో మళ్ళీ వెండితెరను సందడి చేయడానికి వస్తున్నారు. ఈ సినిమా జూలై లో విడుదల కావచ్చు. కాని బాహుబలి రేంజ్ సక్సెస్ కష్టం. మరి కేవలం 5 కోట్ల ఇవ్వలేదని సినిమాలు వదిలేసుకుంటే ఎలా శ్రీదేవి? డబ్బే ముఖ్యమా??