Begin typing your search above and press return to search.

దసరా డైరెక్టర్ టైం తీసుకుంటున్నాడు ఎందుకు..?

By:  Tupaki Desk   |   24 May 2023 10:26 AM GMT
దసరా డైరెక్టర్ టైం తీసుకుంటున్నాడు ఎందుకు..?
X
ఈమధ్య ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న కొత్త దర్శకులు మొదటి సినిమాతోనే తమ టాలెంట్ చూపించి సత్తా చాటుతున్నారు. ఉప్పెనతో బుచ్చిబాబు లేటెస్త్ గా దసరాతో శ్రీకాంత్ ఓదెల విచిత్రం ఏంటంటే ఈ ఇద్దరు దర్శకులు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా చేశారు. సో మ్యాథ్స్ లెక్చరర్ అయిన సుకుమార్ తన అసిస్టెంట్ లకు సినిమా పాఠాలు బాగానే నేర్పిస్తున్నాడని తెలుస్తుంది. దసరాతో డైరెక్టర్ గా మారిన శ్రీకాంత్ ఓదెల తన నెక్స్ట్ సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు.

ఉప్పెన తర్వాత బుచ్చి బాబు ఎలాగైతే చరణ్ తో ఫిక్స్ చేసుకున్నాడో శ్రీకాంత్ కూడా స్టార్ హీరోతో సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ప్రస్తుతం స్టార్ హీరోలంతా కూడా ఎవరి కమిట్మెంట్స్ తో వారు బిజీగా ఉన్నారు.

ఎవరు కూడా కేవలం చేస్తున్న సినిమాతో ఆగిపోలేదు. వరుసగా కనీసం రెండు సినిమాలైనా లైన్ లో పెట్టారు. సో స్టార్ హీరో కోసం శ్రీకాంత్ వెయిట్ చేయాల్సి వస్తే ఎలా లేదన్నా మరో రెండేళ్ల దాకా ఎదురుచూడాల్సి వస్తుంది. అందుకే శ్రీకాంత్ టైర్ 2 హీరోల మీద ఫోకస్ చేశాడని తెలుస్తుంది.

స్టార్ హీరో కోసం మరో అద్భుతమైన పీరియాడికల్ కథ సిద్ధం చేసుకున్నట్టు టాక్. కానీ అది పక్కన పెట్టి ఇప్పుడు మరో కథ రెడీ చేస్తున్నాడట. దీనిలో యువ హీరో నటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.

దసరా తో ఎలాగు హిట్ కొట్టాడు కాబట్టి యువ హీరోలు శ్రీకాంత్ సినిమా నో చెప్పే ఛాన్స్ లేదు. అలా శ్రీకాంత్ తన సెకండ్ సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు. మరి ఈసారి శ్రీకాంత్ ఎవరిని పిక్ చేసుకున్నాడు అన్నది త్వరలో తెలుస్తుంది.

శ్రీకాంత్ ఓదెలతో సినిమా కోసం నిర్మాతలు కూడా ఆసక్తిగా ఉన్నారు. దసరాతో నానికి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఈ డైరెక్టర్ తో సినిమా చేయాలని నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. సో తప్పకుండా శ్రీకాంత్ రెండో సినిమా కూడా భారీ రేంజ్ లో ఉండబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.