Begin typing your search above and press return to search.

చనిపోయిన హీరో అభిమానులు ఆ సినిమాని బ్యాన్‌ చేయాలంటున్నారు

By:  Tupaki Desk   |   15 Aug 2022 2:30 AM GMT
చనిపోయిన హీరో అభిమానులు ఆ సినిమాని బ్యాన్‌ చేయాలంటున్నారు
X
బాలీవుడ్ తీవ్ర సంక్షోభం ను ఎదుర్కొంటోంది. ఇప్పటికే హిందీ ప్రేక్షకులు థియేటర్లకు రావడం కంటే ఓటీటీ లోనే చూసేద్దాం అనే ఒక నిర్ణయానికి వచ్చేసినట్లుగా ఉన్నారు. అందుకే ఈ మధ్య కాలంలో వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా ఉత్తర భారతంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దాఖలాలు లేవు. సౌత్‌ సినిమాలు అయినా అక్కడ కాస్త విజయాలను దక్కించుకుంటున్నాయి కాని హిందీ సినిమాలు మాత్రం పెద్దగా ఆడుతున్నది లేదు.

ఈ సమయంలో వచ్చిన లాల్ సింగ్‌ చడ్డా ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుందో మనకు తెల్సిందే. సినిమా టాక్ తో సంబంధం లేకుండా ఆమీర్ ఖాన్‌ సినిమా అంటే మినిమంగా వసూళ్లు సాధించేది. కాని తాజాగా లాల్ సింగ్ చడ్డా మాత్రం మినిమం గా కూడా వసూళ్లు చేయలేక పోయింది. పైగా లాల్ సింగ్ చడ్డా ను బ్యాన్ చేయాల్సిందిగా సోషల్‌ మీడియా ద్వారా పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు.

ఆమీర్ ఖాన్‌ దేశ వ్యతిరేకి అంటూ ఆయన నటించిన లాల్ సింగ్‌ చడ్డా ను బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ వచ్చింది. అందువల్ల కూడా సినిమాకు కొద్ది మొత్తంలో డ్యామేజీ తప్పలేదు. ఇప్పుడు అదే బ్యాన్‌ ట్రెండ్‌ రణ్‌ బీర్ కపూర్ యొక్క ప్రతిష్టాత్మక సినిమా బ్రహ్మాస్త్ర కు కూడా తప్పేలా లేదు అంటూ బాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

యువ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌ పూత్‌ అభిమానులు బ్రహ్మాస్త్ర సినిమా ను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నెపొటిజం కారణంగానే సుశాంత్ సింగ్ చనిపోయాడు అనేది చాలా మంది వాదన. ఇప్పుడు బ్రహ్మాస్త్ర ప్రాజెక్ట్‌ మొదట సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పూత్‌ వద్దకు దర్శకుడు ఆయాన్ ముఖర్జీ తీసుకు వెళ్లాడని.. కానీ నిర్మాత అయిన కరణ్ జోహార్‌ ఈ సినిమాను రణబీర్ కపూర్ తో చేయాలని ఒత్తిడి చేశాడని టాక్ వినిపిస్తుంది.

అందుకే ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ డిమాండ్‌ చేస్తూ సుశాంత్ సింగ్ రాజ్ పూత్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో బ్రహ్మాస్త్ర విడుదల తేదీ దగ్గర పడుతున్నా కొద్ది బ్యాన్ హ్యాష్‌ ట్యాగ్ ను కూడా మరింతగా ప్రచారం చేయాలని సుశాంత్ అభిమానులు భావిస్తున్నారట. లాల్‌ సింగ్ చడ్డా కి బ్యాన్‌ ప్రచారం చాలా డ్యామేజీ చేసింది. ఇప్పుడు బ్రహ్మాస్త్ర కి కూడా ఆ ఎఫెక్ట్‌ తప్పక పోవచ్చేమో.