Begin typing your search above and press return to search.

ఇలాంటి మాటలు మన హీరోల నోట్లో నుంచి ఎందుకు

By:  Tupaki Desk   |   21 Oct 2019 3:55 AM GMT
ఇలాంటి మాటలు మన హీరోల నోట్లో నుంచి ఎందుకు
X
పండుగల వేళ పెద్ద హీరోల సినిమాలు విడుదల కావటం కొత్త విషయమేమీ కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. ఒక సినిమాకు పెద్ద హీరోల సినిమాలు రెండు.. మూడు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కాలం మారుతున్న కొద్దీ.. పోటీ తీవ్రం కావటం.. విజయం కోసం శాయశక్తులు ఒడ్డడటం లాంటి రోజులు పోయాయి. ఇప్పుడు సీన్ మొత్తం మారింది. నీ సినిమాకు నేను అడ్డు రాను.. నా సినిమాకు నువ్వు అడ్డురాకన్న అడ్జెస్ట్ మెంట్లు పెరిగాయి.

ఒకవేళ.. ఎవరైనా నో అంటే రాజీ చర్చలు మొదలయ్యాయి. దీంతో జరుగుతున్నదేమంటే.. ముఖ్యమైన సందర్భాల్లో.. పండుగల వేళ ఒక సినిమానే అన్ని థియేటర్లలో ఆడే పరిస్థితి. దీంతో..ప్రేక్షకులకు ఛాయిస్ లేకుండా పోతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాకు వెళ్లని పరిస్థితి. ఇటీవల విడుదలైన ఒక పెద్ద సినిమాకు ఇలాంటి పరిస్థితి. ఊరించి..ఊరించి వచ్చిన ఈ సినిమా మొదట బాగుందన్నా.. రెండో రోజుకే సినిమా తేలిపోయింది.

ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమాలో ఏమీ లేదన్న టాక్ స్పెడ్ కావటంతో థియేటర్ల వంక చూడలేని పరిస్థితి. కానీ.. బోలెడన్ని సెలువులు ఉండటం.. థియేటర్లలో సదరు సినిమా తప్పించి..మరో ఛాయిస్ లేకపోవటంతో చచ్చినట్లు అదే సినిమాను చూడాల్సిన దుస్థితి.

ఇటీవల కాలంలో నిర్మాతలు పలువురు.. అందునా పెద్ద సినిమా నిర్మాతలంతా లెక్క వేసుకొని మరీ సినిమాల్ని విడుదల చేస్తున్నారు. దీంతో ప్రేక్షకులకు అప్షన్ తగ్గిపోతోంది. కీలకమైన పండుగ వేళలో.. సెలవుల సీజన్లో ఒక్క సినిమానే రిలీజ్ అవుతున్న పరిస్థితి. దీనికి బదులుగా మూడు నాలుగు సినిమాలు విడుదలైతే.. థియేటర్లు పంచుకోవాల్సి రావటం.. బాగున్న సినిమాకు ప్రేక్షకులు వెళితే.. మినిమంగా రావాల్సిన కలెక్షన్లు రావన్న ఆలోచనతో ఒక వారం ఒక పెద్ద సినిమా అన్నట్లుగా పరిస్థితి మారిందని చెప్పాలి.

అయితే.. అందుకు భిన్నంగా ఈ దీపావళికి తమిళనాడులో ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇదే విషయాన్ని హీరో కార్తీక్ ఎంత స్పోర్టివ్ గా చెప్పారో చూస్తే ముచ్చటపడిపోవటమే కాదు.. ఇలాంటి మాటలు తెలుగు హీరోల నోటి నుంచి రావెందుకన్న డౌట్ రాక మానదు.

ఇంతకీ కార్తీ నోటి నుంచి వచ్చిన మాటేమిటంటే.. ‘‘పండక్కి రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఏది బాగుంటే దాన్ని చూస్తారు. పండగ వేళ ప్రేక్షకులకు అప్షన్స్ ఉండాలి. బావుంటే రెండు సినిమాలు చూస్తారు’’ అని. ఈ సంక్రాంతి సీజన్ లో తమిళనాడులో విడుదలైన రెండు పెద్ద సినిమాలు పేట్టా.. విశ్వాసం రెండూ హిట్ కావటాన్ని ప్రస్తావిస్తూ.. పోటీ ఉండాల్సిందేనన్న విషయాన్ని చెప్పేశాడు. మరి.. మన హీరోలు ఎందుకిలా ఆలోచించరంటారు?