Begin typing your search above and press return to search.
పొగడ్తలు సరే.. ఉస్తాద్ రామ్ తో సినిమా ఏది గురూజీ?
By: Tupaki Desk | 12 Oct 2022 2:30 AM GMTకెరీర్ లో ఎదిగే క్రమంలో ప్రతీ అడుగూ ప్రత్యేకంగానే వుంటుంది. అయితే కొంత మంది మాత్రం ఎక్కిన తొలి మెట్టుని.. ఇచ్చిన తొలి అవకాశాన్ని ఎంత ఎదిగినా ఎప్పటికీ ప్రత్యేకంగానే గుర్తుంచుకుంటారు. తమ మనసులో తొలి అవకాశం ఇచ్చిన, తమ తో తొలి అడుగు వేయించిన వారిని ప్రత్యేకంగా చూస్తుంటారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా తనకు దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చిన స్టార్ ప్రొడ్యూసర్ స్రవంతి రవికిషోర్ ప్రత్యేక గౌరవాన్నిస్తున్నారు.
కెరీర్ ప్రారంభంలో నువ్వే కావాలి, స్వయం వరం వంటి సినిమాలతో రైటర్ గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ స్రవంతీ మూవీస్ అధినేత రవికిషోర్ నిర్మించిన రొమాంటిక్ లవ్ స్టోరీ 'నువ్వే నువ్వే'తో దర్శకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. ఈ మూవీ విడుదలై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్ర బృందం ఈ మూవీని మీడియాకు హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో గల ఏఎంబీ సినిమాస్ లో ప్రత్యేకంగా ప్రదర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన త్రివిక్రమ్ నిర్మాత స్రవంతి రవికిషోర్ పై ఓ రేంజ్ లో తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు. ఆ టైమ్ లో స్రవంతి రవికిషోర్ కు తకు మధ్య జరిగిన కొన్ని ఆసక్తికర విషయాల్ని చెప్పుకొచ్చారు. వనమాలి హౌస్ లో 'నువ్వు కావాలి' షూటింగ్ జరుగుతోంది. రవికిషోర్ గారు, నేను పక్కన ఖాళీ స్థలంలో నడుస్తూ మాటల మధ్యలో కథ చెప్పా. ఆయన చెక్ బుక్ తీసి ఒక అమౌంట్ వేసి ఇచ్చారు. 'నువ్వే కావాలి' కి రైటర్ గా ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో.. దాదాపుగా అంత అమౌంట్ అడ్వాన్స్ గా ఇచ్చారన్నారు. అంతే కాకుండా అడ్వాన్స్ తో తాను బైక్ కొనుక్కున్నానన్నారు.
'నువ్వే కావాలి' షూటింగ్ దశలో వుంది. నేను ఏం చేయగలనో తెలియదు.. కానీ నేను చెప్పిన కథ విని రవికిషోర్ గారు ఎంతో నమ్మారు. ఆయనకు నేను ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అన్నారు. మద్రాసులో 'నీరం' చూసి అందులో సన్నివేశాలను త్రివిక్రమ్ ఇష్టం వచ్చినట్టుగా ఎలా మార్చినా విన్నారట. అంతే కాకుండా 'స్వయంవరం' తరువాత తనని ఎవరూ పిలవకపోవడంతో భీమవరం వెళ్లి క్రికెట్ ఆడుకుంటుంటే ఎస్టీడీ ఫోన్ బూత్ నంబర్ కనుక్కుని మరీ రివికిషోర్ ఫోన్ చేశారట. అంతే కాకుండా 'నువ్వునాకు నచ్చావ్' కథని తాను అనుకున్న హీరోకే వినిపిస్తానంటే 'నీ ఇష్టం వచ్చినట్టు చావ్' అన్నారట. అంతే కాకుండా రాత్రిపూట స్క్రిప్ట్ చదివి ఫోన్ లో ఏడ్చేశారట.
ప్రతీ విషయంలోనూ తనని భరించిన నిర్మాత స్రవంతి రవికిషోర్ కు ఎలా కృతజ్ఞతలు ఎలా చెప్పాలని, తాను రాసిన మాటలు వినో రసికుడిని నాకు ప్రసాదించినందుకు దేవుడికి ఎన్ని సార్లైనా కృతజ్ఞతలు చెప్పాలి అని స్రవంతి రవికిషోర్ కు ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చాడు త్రివిక్రమ్.. అంతా బాగానే వుంది. మరి ఇంత ఎలివేషన్ ఇచ్చిన నిర్మాతకు రామ్ తో సినిమా ఇప్పటికీ ఎందుకు చేయలేకపోతున్నారని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి త్రివిక్రమ్ ఈ కామెంట్ లపై ఏమంటారో?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.