Begin typing your search above and press return to search.
'1770' కాన్సెప్ట్ టీజర్ పై జక్కన్న మౌనం దేనికి?
By: Tupaki Desk | 19 Aug 2022 2:30 AM GMTదేశం గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో `1770` అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిదే. ఈ చిత్రానికి స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఈ చిత్రం కాన్సెప్ట్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. కొంత మంది టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం టీజర్ మెచ్చారు.
కానీ లెజెండరీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి మాత్రం టీజర్ పై ఇంకా స్పందించలేదు. టీజర్ రిలీజ్ అయి కొన్ని గంటలు గడుస్తున్నా జక్కన్న ఇంకా మౌనంగానే ఉన్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా రకరకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇటీవలే విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయిన సంగతి తెలిసిందే. భారతీయ సినీ పరిశ్రమకి ఆయన అందించిన సేవల్ని గౌరవించి ఈ అవకాశాన్నికేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కల్పించింది.
సభ్యుడిగా నామినేట్ అవ్వడం..`1770` చిత్రాన్ని ప్రకటించడం రెండు ఒకేసారి జరగడంతో దీని వెనుక రాజకీయ కోణం ఉందా? అంటూ సందేహిస్తున్నారు. స్టార్ రైటర్ ఆర్ ఎస్ ఎస్ ఎజెండా వైపు వెళుతున్నట్లు ప్రచారం మొదలైంది. 1770 చిత్రం స్వాతంత్ర్యాన్ని నేపథ్యంగా ఎంచుకున్న కథాంశంగా కనిపిస్తుంది. బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన సన్యాసి తిరుగుబాటుదారుల కథతో తెరపైకి వస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
తిరుగుబాటు నేపథ్యం కాబట్టి ఈ చిత్రానికి హిందుత్వ ఎజెండా ఉండవచ్చని ప్రచారం ఠారెత్తిపోతుంది. `1770` వాస్తవానికి 1882లో రచించబడిన బంకిం చంద్ర బెంగాలీ నవల `ఆనందమత్` ఆధారంగా రూపొందించబడిందని ఇప్పటికే యూనిట్ రివీల్ చేసింది. అయితే ఇదే పుస్తకం ఆధారంగా 1952లో బాలీవుడ్‌లో ఇప్పటికే ఒక సినిమా తెరకెక్కించారు.
అది ఆర్ ఎస్ ఎస్ అజెండాను కలిగి ఉంటుందన్నది కొందరి భావన. ఈ నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ తన రచనలో భాగంగా దీన్నే బేస్ గా తీసుకున్నారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రాజమౌళి మౌనానికి కారణం కూడా అదేనా? అన్నది తెలియాలి. మరి ఆ సంగతేంటో? తేలాలంటే స్టార్ రైటర్ లైన్ లోకి రావాల్సిందే.