Begin typing your search above and press return to search.

ఇలాంటి టైమ్‌ లో ఈ ప్రయోగాలు ఎందుకు అమ్మడు?

By:  Tupaki Desk   |   6 Nov 2021 4:59 AM GMT
ఇలాంటి టైమ్‌ లో ఈ ప్రయోగాలు ఎందుకు అమ్మడు?
X
దేశముదురు సినిమా తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ముద్దుగుమ్మ హన్సిక. తెలుగు లో వరుసగా సినిమాలు చేసింది కాని స్టార్‌ హీరోయిన్స్ జాబితాలో చేరడంలో విఫలం అయ్యింది. పెద్ద హీరోలకు జోడీగా నటించే అవకాశాలను అందిపుచ్చుకోవడంలో సఫలం కాలేక పోయిన హన్సిక తమిళంలో మాత్రం స్టార్‌ హీరోయిన్‌ గా పేరు దక్కించుకుంది. అక్కడ పెద్ద హీరోలు.. ప్రముఖ హీరోలకు జోడీగా నటించి మెప్పించింది. తెలుగు లో మరియు తమిళంలో కంటిన్యూస్ గా సినిమాలు చేస్తున్న దేశముదురు పాప అరంగేట్రం చేసి పుష్కర కాలం దాటి పోయింది. ఇలాంటి సమయంలో సహజంగానే ఆఫర్లు తగ్గడం.. ప్రాముఖ్యత లేని పాత్రలు రావడం జరుగుతుంది. లేదంటే హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాలకు కమిట్‌ అవ్వాల్సి ఉంటుంది. హన్సిక కూడా కెరీర్‌ చివరి దశలో ఉంది. ఈ సమయంలో ఎంపిక చేసుకునే సినిమాలు చాలా కీలకంగా మారుతాయి.

చేసేవి ఒకటి రెండు సినిమాలు అయినా కూడా ఈ టైమ్ లో ఆచితూచి చేయాల్సిన అవసరం ఉంటుంది. క్రేజ్ లేని ఈ సమయంలో లేని పోని ప్రయోగాల పేరుతో సినిమాలు చేస్తే ఖచ్చితంగా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్ల పడటం ఆఫర్లు పూర్తిగా రాకుండా కనుమరుగవ్వడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో సినిమాల ఎంపిక విషయంలో తెలివిగా ఉండాల్సిన హన్సిక ప్రయోగం పేరుతో 105 మినిట్స్ అనే సినిమాను చేసింది. సింగిల్ టేక్ లో ఈ సినిమాను చేశామని చెబుతున్నారు. వారు ఉపయోగించిన టెక్నాలజీ ఏంటీ.. ఇంతకు ఆ సింగిల్ టేక్ కథ ఏంటీ అనేది క్లారిటీ రావాల్సి ఉంది. తాజాగా దీపావళి సందర్బంగా సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ ను విడుదల చేయడం జరిగింది. సినిమా గ్లిమ్స్ చూసిన తర్వాత రొటీన్‌ థ్రిల్లర్‌ గానే ఈ సినిమా ఉండబోతుందనే అభిప్రాయంకు ప్రేక్షకులు వచ్చేశారు.

అసలే నీ పై ఆసక్తి తగ్గుతున్న ఈ సమయంలో మరింతగా ఆసక్తి తగ్గిపోయేలా ఇలాంటి సినిమాలు చేయడం ఏంటీ హన్సిక అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో నీ యాక్టింగ్‌ ను కొత్తగా చూపించడం కాని.. ప్రేక్షకులను థ్రిల్‌ చేసే ఎలిమెంట్స్ కాని ఉంటాయని మేము అనుకోవడం లేదు. ఈ సినిమా నీ కెరీర్ కు దోహదపడుతుందనే నమ్మకం లేదు అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెరీర్ చివరి దశలో మంచి కమర్షియల్‌ సినిమాలు కాని.. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేసినా కూడా మంచి సబ్జెక్ట్‌ లను ఎంపిక చేసుకుని చేయాల్సి ఉంది. కాని ఇలా ప్రయోగాలు చేయడం ఏంటో అంటూ హన్సిక విషయంలో కొందరు పెదవి విరుస్తున్నారు. ఇలాంటి ప్రయోగాలకు అస్సలు సమయం కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు