Begin typing your search above and press return to search.

ఆ హీరోలను ఎప్పుడు స్టార్ హీరోలుగా కన్సిడర్ చేస్తారు...?

By:  Tupaki Desk   |   16 Sep 2020 1:00 PM GMT
ఆ హీరోలను ఎప్పుడు స్టార్ హీరోలుగా కన్సిడర్ చేస్తారు...?
X
కొత్త నీరు రాగానే పాత నీరు అలా కొట్టుకుపోవడం సహజం. అయితే అన్ని విషయాల్లో ఇది నిజం అనిపిస్తుందేమో కానీ సినిమా హీరోల విషయంలో మాత్రం ఈ సామెత వర్తించదని చెప్పవచ్చు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో మిగతా విభాగాల్లో కొత్తవారు వచ్చినప్పుడు పాతవారు కొన్ని రోజులకు ఫేడ్ ఔట్ అయ్యే దశకు చేరుకుంటారు. కానీ టాలీవుడ్ లో కొత్త హీరోలు ఎంతమంది వచ్చినా సీనియర్ హీరోలు మాత్రం ఇంకా టాప్ స్టార్స్ గానే పిలవబడుతుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి - కింగ్ నాగార్జున - విక్టరీ వెంకటేష్ - నందమూరి బాలకృష్ణ 90స్ నుండి ఇప్పటి వరకు స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఆ తర్వాత జనరేషన్ లో వచ్చిన మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ లు 20 ఏళ్లకు పైగా హీరోలుగా ఉన్నారు. ఇక ప్రభాస్ - ఎన్టీఆర్ - రవితేజ - రామ్ చరణ్ - అల్లు అర్జున్ లు కూడా వీరి సరసన నిలబడ్డారు. అయితే వీరితో పోటీగా సినిమాలు తీసే చాలామంది హీరోలు ఇంకా మిడిల్ రేంజ్ హీరోలుగానే పిలవబడుతున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నాని - విజయ్ దేవరకొండ - నాగచైతన్య - రామ్ పోతినేని - నితిన్ - సాయి ధరమ్ తేజ్ - వరుణ్ తేజ్ వంటి హీరోలుగా మిడిల్ రేంజ్ హీరోలుగా కొనసాగుతున్నారు. ముందుగా నేచురల్ స్టార్ నాని ఎప్పుడూ చేతి నిండా సినిమాలతో బిజీ హీరోగా ఉంటాడు. సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న హీరోల్లో ఒకరైన నాని.. ఇప్పుడు మార్కెట్ పరంగా కూడా ఇంకో మెట్టుకు చేరుకున్నాడు. విజయ్ దేవరకొండ సైతం 'అర్జున్ రెడ్డి' సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ నమోదు చేశాడు. అంతేకాకుండా 'గీత గోవిందం' సినిమాతో 100 కోట్ల మార్క్ ని కూడా రీచ్ అయ్యాడు. ఇక అక్కినేని వారసుడు నాగచైతన్య 'మజిలీ' 'వెంకీమామ' వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ సొంతం చేసుకుని 50కోట్ల మార్క్ ని క్రాస్ చేశాడు. దగ్గుబాటి రానా 'బాహుబలి' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగుతో పాటు హిందీ తమిళ్ చిత్రాల్లో నటిస్తూ క్రేజీ హీరోగా మారిపోయాడు.

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా 'చిత్రలహరి' 'ప్రతిరోజూ పండగే' విజయాలతో ట్రాక్ లోకి వచ్చాడు. మరో మెగా హీరో వరుణ్ తేజ్ 'ఎఫ్ 2' సినిమాతో 100 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ రాబట్టాడు. యువ హీరో రామ్ పోతినేని 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో కలెక్షన్ల వేట ప్రారంభించాడు. ఈ క్రమంలో డబ్బింగ్ సినిమాతో నార్త్ లో కూడా మంచి ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు రామ్. ఇక నితిన్ కూడా 'భీష్మ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని అర డజను ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టుకున్నాడు. వీళ్ళందరూ వరుస సినిమాలతో సగానికి పైగా టాలీవడ్ మార్కెట్ ని ఆక్రమిస్తున్నా ఇంకా మిడిల్ రేంజ్ హీరోలుగానే పిలవబడుతున్నారు. మరి వీరంతా స్టార్ హీరోల కింద ఎప్పుడు పరిగణించబడతారో చూడాలి.