Begin typing your search above and press return to search.
సామ్ ఎందుకిలా కలవరపెడుతోంది?
By: Tupaki Desk | 27 Oct 2022 2:38 AM GMTసామాజిక మాధ్యమాల్లో దాదాపు రెండున్నర కోట్ల మంది ఫాలోవర్లతో టాలీవుడ్ కథానాయికల్లోనే సమంత టాప్ ప్లేస్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ వేదికపై ఏదో ఒక అప్ డేట్ అందిస్తూ నిరంతర ఫోటోషూట్లు వీడియో షూట్లతో అభిమానులకు టచ్ లో ఉండేది. కానీ ఎందుకనో ఇటీవల ఉన్నట్టుండి సామాజిక మాధ్యమాల నుండి అనూహ్యంగా దూరమైంది. తన నుంచి ఏదైనా అప్ డేట్ వస్తుందని ఆశిస్తే అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. నిన్నటికి నిన్న అందాల కథానాయికలంతా దీపావళి పండుగను ఎంతో గొప్ప ఉత్సవంగా జరుపుకున్నారు. అందమైన దుస్తుల్లో అలంకరణలతో సాంప్రదాయ బద్ధంగా కనిపించే ఫోటోలను షేర్ చేసారు.
కానీ సామ్ వీటన్నిటికీ ఎందుకనో దూరంగా ఉంది. అసలు తన ఫేవరెట్ ఇన్ స్టా మాధ్యమం సహా ఇతర సామాజిక మాధ్యమాలకు సమంత ఎందుకని దూరంగా ఉంది? అంటే సమాధానం లేదు. ఇటీవల సమంతపై రకరకాల గాసిప్పులు షికార్ చేస్తున్నాయి. తనకు ఆరోగ్యం బాలేదని ఛర్మ సంబంధ సమస్యలు రిపీటవుతున్నాయని వాటికి చికిత్స కోసం అమెరికా వెళ్లిందని కూడా గుసగుసలు వినిపించాయి. కానీ వీటికి సామ్ అస్సలు స్పందించలేదు.
ఇంతలోనే నేనున్నాను! అంటూ సమంత ఇన్ స్టాలో అకస్మాత్తుగా ఓ రెండు పోస్ట్ లు చేసింది. అక్టోబర్ రెండవ వారంలో కేవలం 4 రోజుల వ్యవధిలో వరుస కథనాలతో తిరిగి ట్రాక్ లోకి వచ్చింది. ఇక సామ్ సందడి మొదలైనట్టే అనుకుంటుండగానే మళ్లీ ఎందుకనో నిశ్శబ్ధంగా ఉండిపోయింది. ఇంతకీ సామ్ కి ఏమైంది? ఎందుకిలా చేస్తోంది? అంటూ అభిమానులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 11న తన చివరి పోస్ట్ తర్వాత సమంతా చడీ చప్పుడు లేకుండా ఉండిపోయింది. ఇటీవలే 'యశోద' సినిమా ట్రైలర్ రానున్నట్లు ప్రకటించిన వీడియోను షేర్ చేసింది. దానితర్వాత మళ్లీ తన నుంచి ఎలాంటి అప్ డేట్ లు లేవు. కనీసం దీపావళి శుభాకాంక్షలు కూడా చెప్పలేదు సామ్. దీంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ సమంతకు ఏమైంది? అంటూ ఆరాలు తీస్తున్నారు.
ఇక ఇటీవలి కాలంలో సమంత పబ్లిక్ అప్పియరెన్సులు ఫోటోషూట్లు కూడా ఏవీ కనిపించడం లేదు. అన్ని మీడియాల నుంచి దూరంగా ఉంటోంది. కారణం ఏదైనా కానీ సామ్ చేస్తున్నది సరికాదని అభిమానులు అలకబూనారు. సాధ్యమైనంత తొందర్లోనే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుందనే ఆశిస్తున్నారు. ఎలానూ యశోధ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో చాలా విషయాలపై ఓపెనప్ అవుతుందేమో చూడాలి.
అజ్ఞాతం వీడినట్టేనా?బ్యాక్ టు బ్యాక్ తాను నటించిన సినిమాలను అభిమానుల ముందుకు తెచ్చేందుకు సమంత సిద్ధమవుతోంది. బాలీవుడ్ కి వెళ్లే ముందే టాలీవుడ్ లో మరోసారి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది.
సామ్ నటించిన శాకుంతలం.. యశోద చిత్రాల విడుదలలకు టైమ్ దగ్గర పడింది. శాకుంతలం నవంబర్ 4న విడుదలవుతుందని దిల్ రాజు ప్రకటించాక 'యశోద' నిర్మాతలు దీపావళికి విడుదల చేయాలనుకున్న తమ చిత్రాన్ని వాయిదా వేశారు. కానీ వీఎఫ్ ఎక్స్ సహా నిర్మాణానంతర పనుల కారణంగా 'శాకుంతలం' ప్రకటించిన తేదీన విడుదల కాదని వచ్చే ఏడాదికి వాయిదా పడొచ్చని స్పష్టమైంది. దాంతో యశోద మేకర్స్ కి విడుదలకు స్కోప్ దొరికింది. నవంబర్ 11వ తేదీన రిలీజ్ ని ఖరారు చేస్తారని భావిస్తున్నా అధికారికంగా దీనిని వెల్లడించాల్సి ఉంటుంది.
అయితే సమంత ఈ రెండు సినిమాలను ప్రమోట్ చేసేందుకు ఇక అజ్ఞాతం వీడాల్సి ఉంటుంది. తెలుగు మీడియా ముందుకు రావాల్సి ఉంది. అయితే తనకు ఎదురయ్యే చిక్కు ప్రశ్నల గురించే అభిమానుల్లో ఆత్రుత. సామ్ ఇటీవల సడెన్ గా అమెరికా ఎందుకు వెళ్లినట్టు? స్కిన్ ట్రీట్ మెంట్ నిజమా? అంటూ ప్రశ్నలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే చైతన్యతో బ్రేకప్ పైనా కొన్ని ప్రశ్నలు తప్పదు. కానీ వీటన్నిటికీ సమాధానాలిచ్చేందుకు సామ్ సిద్ధంగా ఉందా? లేదా? అన్నదానికి కాలమే సమాధానం ఇవ్వాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.