Begin typing your search above and press return to search.

ప్రేమ గువ్వ‌లు గేమాడుకుంటే మ‌ధ్య‌లో వీళ్లెందుకు..!

By:  Tupaki Desk   |   21 Jun 2021 4:30 AM GMT
ప్రేమ గువ్వ‌లు గేమాడుకుంటే మ‌ధ్య‌లో వీళ్లెందుకు..!
X
దాదాపు నాలుగేళ్లుగా ఆ ఇద్ద‌రూ క‌లిసే ఏం చేసినా.. విందు వినోదాలు విహార యాత్ర‌లు .. ఫ్యామిలీ బ్రంచ్ లు .. జిమ్ యోగా సెష‌న్లు.. ప్ర‌తిదీ క‌లిసే.. విడివిడిగా ఏదీ లేదు. క‌లిసే ఉంటారు.. కానీ మేం విడిపోయాం అని చెబుతారు. కుటుంబంలో క‌ల‌త‌లొచ్చాయని ప్ర‌చారం చేస్తారు.. కానీ ఏదీ నిజం కాద‌ని సోష‌ల్ మీడియా స‌మావేశాలు హ‌గ్గింగులు ప్రాక్టీస్ సెష‌న్లు చెబుతుంటాయి.

గొడ‌వ‌లొస్తాయి.. కొట్టుకుంటారు.. విడిపోతారు.. తిరిగి క‌లుసుకుంటారు.. ఇదీ ఆ ఇద్ద‌రి వ‌రుస‌. ఇంత క్లారిటీగా ఇన్ని జ‌రుగుతుంటే ఆ ఇద్ద‌రినీ ప్రేమ ప‌క్షులు అని పిలిస్తే త‌ప్పేంటి? అనేదే కొంద‌రి సందేహం. ఇక సండే ఫండే అంటూ ఈ జంట చిలిపి ఆటలు కూడా ఇప్పుడు అంత‌ర్జాలంలో హాట్ హాట్ గా వైర‌ల్ అయిపోతున్నాయి.

ప్రియుడు కాదు బోయ్ ఫ్రెండ్ అని చెప్పుకుంటున్న దిశా ప‌టానీతో టైగ‌ర్ క‌ల‌యికేమిటో.. అది కూడా ఆట కోసం.. అబ్బో చాలా ల‌వ్ లీ గేమ్స్ ఆడుతున్నారు! అంటూ అభిమానులు కొంటెగా కామెంట్లు రువ్వుతున్నారు. అలా ఫుట్ బాల్ గ్రౌండ్ లో ఫ‌న్ డే ఎంజాయ్ మెంట్ బావుందిలే అంటూ పొగిడేస్తున్నారు. దిశా-టైగ‌ర్ జంట‌తో పాటే అర్జున్ క‌పూర్ - ర‌ణ‌బీర్ కపూర్ కూడా ఈ సండే ఫండే గేమ్స్ లో చేరారు. అయినా ప్రేమ గువ్వ‌లు ఆటాడుకుంటే ఆ ఇద్ద‌రూ ఎందుకు? అన్న‌దే ఇప్పుడు అంద‌రి సందేహం!!