Begin typing your search above and press return to search.

#BBS3 : కూల్ మ్యాన్ వరుణ్ కోపంకు కారణం ఏంటి?

By:  Tupaki Desk   |   27 Aug 2019 10:37 AM GMT
#BBS3 : కూల్ మ్యాన్ వరుణ్ కోపంకు కారణం ఏంటి?
X
ఇండియన్‌ బిగ్‌ బాస్‌ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 లోకి హీరో వరుణ్‌ సందేశ్‌ మరియు ఆయన భార్య వితిక షేరులను పంపించిన విషయం తెల్సిందే. వీరిద్దరి మద్య చిలిపి గొడవలు.. రొమాన్స్‌ తో బిగ్‌ బాస్‌ ప్రేక్షకులు ఎంటర్‌ టైన్‌ అవుతారని షో నిర్వాహకులు అనుకున్నారు. అయితే షో ప్రారంభం అయ్యి అయిదు వారాలు పూర్తి అయ్యింది. ఇప్పటి వరకు ఇద్దరి మద్య ఆసక్తికర సంఘటనలు ఏమీ చోటు చేసుకోలేదు. చిన్న చిన్న గొడవలు కావడం.. వెంటనే అవి సర్దుమనగడం జరిగింది.

ప్రతి చిన్న విషయానికి కూడా అలిగే వితిక వల్ల వరుణ్‌ అప్పుడప్పుడు ఇబ్బందులు పడుతూ.. క్షమాపణలు చెబుతూ వస్తున్నాడు. వరుణ్‌ చాలా ఓపికగా అమాయకంగా వితిక వద్ద మాట్లాడటం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అలా అమాయకంగా ఉండే వరుణ్‌ ఏకంగా వితిక మొహం పై కాఫీ విసిరేంతగా మ్యాటర్‌ సీరియస్‌ అయ్యింది. నేడు ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌ కు సంబంధించిన ప్రోమోలో వరణ్‌ మరియు వితికల ఫైట్‌ పీక్స్‌ కు చేరినట్లుగా కనిపిస్తుంది.

నిన్నటి ఎపిసోడ్‌ లో బాగానే ఉన్న వీరిద్దరు ఒక్కసారిగా ఇంత వైలెంట్‌ అవ్వడం ఏంటీ.. ముఖ్యంగా వరుణ్‌ ఏంటీ ఇంతగా సీరియస్‌ అయ్యాడంటూ ప్రోమో చూసిన వారంతా కూడా నేటి ఎపిసోడ్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొందరు మాత్రం దీన్ని సీక్రెట్‌ టాస్క్‌ అంటుండగా కొందరు ఇది సీరియస్‌ ఇష్యూ అయ్యి ఉంటుందని అంటున్నారు. ఈ వారంలో వరుణ్‌ సందేశ్‌ నామినేషన్‌ లో ఉన్నాడు. ఆ కారణంగా కాస్త డిస్ట్రిబ్‌ అయ్యి ఇలా ఓవర్‌ గా రియాక్ట్‌ అయ్యి ఉంటాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అసలేం జరిగిందనేది రాత్రి ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌ లో చూడాల్సిందే.

For Video Click Here