Begin typing your search above and press return to search.
తెలుగు ఆడియన్స్ అంటే ఎందుకంత చిన్నచూపు
By: Tupaki Desk | 9 April 2022 12:30 PM GMTయావత్ దేశం మొత్తం టాలీవుడ్ వైపు.. టాలీవుడ్ ప్రేక్షకుల వైపు చూస్తుంటే ఒకే ఒక్క హీరో మాత్రం ఇక్కడి ప్రేక్షకుల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. కేర్ కూడా చేయడం లేదు. అతను మరెవరో కాదు తమిళ హీరో ఇళయదళపతి విజయ్. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. విజయ్ హీరోగా నటించిన భారీ చిత్రం 'బీస్ట్'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం తమిళంలో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.
విజయ్ చిత్రాలకు గతంలో తెలుగులో పెద్దగా మార్కెట్ వుండేది కాదు కానీ ఇటీవల గడిచిన కొన్నేళ్లుగా ఆయన సినిమాలకు మంచి మార్కెట్ క్రియేట్ అయింది. పోలీసోడు, సర్కార్, అదిరింది, మాస్టర్ వంటి చిత్రాలకు తెలుగులో మంచి వసూళ్లు దక్కాయి. అలాగే మంచి మార్కెట్ కూడా జరిగింది. దీంతో విజయ్ నటించిన తాజా చిత్రం 'బీస్ట్' పై కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ రావడం కాయం అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ఇదిలా వుంటే ఈ చిత్ర ప్రచారానికి రావడానికి మాత్రం విజయ్ అస్సలు ఇష్టపడటం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తనకు హ్యూజ్ క్రేజ్ ఏర్పడినా విజయ్ మాత్రం తెలుగు ప్రేక్షకుల్ని లెక్కచేయకపోవడం పలువురిని విస్మాయానికి గురిచేస్తోంది. తెలుగు ప్రేక్షకులు ఆయనపై తమ అభిమాన్ని కురిపిస్తున్నా విజయ్ మాత్రం పెద్దగా పట్టించుకోకుండా లైట్ తీసుకోవడం గమనార్హం. ఇతర భాషలకు చెందిన హీరోలు తెలుగులో తమ సినిమా రిలీజ్ అవుతోందంటే ఖచ్చితంగా ప్రమోషన్స్ కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు.
విజయ్ మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రర్తిస్తున్నాడు. తెలుగు 'బీస్ట్' రిలీజ్ ప్రమోషన్స్ కోసం హీరోయిన్ పూజా హెగ్డే, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ , సంగీత దర్శకుడు అనిరుధ్ తో పాటు ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్న దిల్ రాజు మాత్రమే పాల్గొన్నారు. విజయ్ హాజరు కావడానికి ఆసక్తి చూపించకపోవడం వల్లే హీరోయిన్ , డైరెక్టర్ తెలుగు వెర్షన్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ట్రిపుల్ ఆర్, పుష్ప సినిమాల రిలీజ్ టైమ్ లో మన హీరోలు దేశ వ్యాప్తంగా వున్న ప్రధాన నగరాల్లో పర్యటించి తమ సినిమాని ప్రమోట్ చేసుకున్నారు. తమిళ వెర్షన్ ప్రచారం కోసం చెన్నై కూడా వెళ్లి ప్రత్యేకంగా మీడియా తో ఇంటరాక్ట్ అయ్యారు. అయితే విజయ్ మాత్రం హైదరాబాద్ రావడానికి బద్దకించడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది.
అంతే కాకుండా ఇటీవల లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విజయ్ - వంశీ పైడిపల్లిల బై లింగ్వల్ మూవీ కూడా చెన్నైలోనే పూజాకార్యక్రమాలతో ప్రారంభించిన విషయం తెలిసిందే. విజయ్ ఇలాంటి ప్రవర్తన తో టాలీవుడ్ ప్రేక్షకుల్ని హర్ట్ చేస్తున్నారని