Begin typing your search above and press return to search.
సోషల్ మీడియా సరే.. స్క్రిప్టులు కూడా చూడాలి రౌడీ!
By: Tupaki Desk | 17 Dec 2019 7:29 AM GMTఈమధ్య తెలుగు తెరపైకి దూసుకొచ్చిన నవతరంగం విజయ్ దేవరకొండ. 'అర్జున్ రెడ్డి' సినిమాతో యువ ప్రేక్షకులకు విజయ్ ఫేవరెట్ హీరోగా మారిపోయాడు అని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. దానికంటే ముందు విడుదలైన 'పెళ్ళిచూపులు'.. తర్వాత విడుదలైన 'గీతగోవిందం'.. 'టాక్సీవాలా' సినిమాలతో ఇతర వర్గాల ప్రేక్షకుల అభిమానం కూడా సంపాదించాడు విజయ్. హిట్లు చాలామంది యువ హీరోలకు వస్తాయి కానీ తనదైన విభిన్న ప్రవర్తన తో రౌడీ ఇమేజ్ కూడా తెచ్చుకున్నాడు.
అంతా బాగానే ఉంది. ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంది. జస్ట్ తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా యువతకు విజయ్ పేరు తెలుసు అంటేనే మనం విజయ్ క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. దీంతో సోషల్ మీడియాలో విజయ్ జోరు ఎక్కువే. పైగా బాలీవుడ్ సుందరాంగులు కూడా మా ఫేవరెట్ హీరో విజయ్ అని చెప్తూ ఉండడంతో విజయ్ పాపులారిటీ మరింతగా పెరుగుతోంది. సోషల్ మీడియాలో విజయ్ ప్రెజెన్స్.. ఫాలోయింగ్.. లాంటివి కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే టాలీవుడ్ టాప్ స్టార్ హీరోలను మించిపోయినట్టుగా అనిపిస్తుంది.
వీటికి తోడు విజయ్ - పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా 'ఫైటర్' ను దేశవ్యాప్తం గా వివిధ భాషలలో విడుదల చేయాలనుకోవడం.. బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ ను ఈ సినిమాలో విజయ్ కు జోడీగా ఎంచుకోవడం అన్నీ బాగానే ఉన్నాయి. వీటితోనే విజయ్ ఇప్పుడు మనకు తెలుగులో ఉన్న పెద్ద స్టార్లను మించిపోయినట్టు మాత్రం కాదు. ఎందుకంటే క్రేజ్ లాంటివి బాగానే ఉన్నప్పటికీ స్క్రిప్ట్ సెలెక్షన్ విషయంలో విజయ్ ఇంకా తడబడుతోనే ఉన్నాడు. హిట్ అయిన సినిమాల సంగతి పక్కన పెడితే విజయ్ కెరీర్లో 'నోటా'.. 'డియర్ కామ్రేడ్' లాంటి ఫ్లాపులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా 'డియర్ కామ్రేడ్' ను భారీగా ప్రమోట్ చేసినప్పటికీ ప్రేక్షకులు తిరస్కరించారు. పైగా విజయ్ పాత్రల్లో అప్పుడే మొనాటనీ కనిపిస్తోందనే ఒక అభిప్రాయం వినిపిస్తోంది.
విజయ్ తాజా చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కాగానే ఈ అభిప్రాయం ఎక్కువగా వినిపించింది. 'అర్జున్ రెడ్డి' హ్యాంగోవర్ నుంచి ఇంకా విజయ్ బయటకు రాలేదని కొందరు అన్నారు. 'డియర్ కామ్రేడ్' లో అదే ఛాయలు ఉన్న ఎపిసోడ్.. 'వరల్డ్ ఫేమస్ లవర్' లో కూడా అదే ఛాయలు ఉన్న పోస్టర్ లు రిలీజ్ చెయ్యడం.. ప్రతి సినిమాలో ఇమ్రాష్ హాష్మి లాగా అవసరం ఉన్నా లేకపోయినా అదేపనిగా లిప్పు లాకులు లాగించడం చూస్తుంటే విజయ్ రొటీన్ ఇమేజ్ చట్రంలో పడిపోతున్నాడేమో అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
టాలీవుడ్ హీరో లాగా అయినా.. సౌత్ హీరోలా అయినా.. ప్యాన్ ఇండియన్ హీరోలా అయినా ఎవరికైనా స్క్రిప్ట్ సెలెక్షన్ ముఖ్యం. ప్రభాస్ లాంటి పెద్ద స్టార్లకే ఎలాంటి సినిమాలు చెయ్యాలో అంతుచిక్కక ప్రాజెక్టులు డిలే అవుతున్నాయి. ఇలాంటి సమయంలో స్క్రిప్ట్ సెలెక్షన్ పై దృష్టి పెట్టకుండా ఇన్స్టా గ్రామ్ లో భారీ ఫాలోయింగ్.. గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన హీరో.. సౌత్ క్రేజీ స్టార్ లాంటి టాగ్స్ మాయలో పడిపోతే విజయ్ కే నష్టమనే అభిప్రాయం వినిపిస్తోంది.