Begin typing your search above and press return to search.

ఆ న‌టి పై విశాల్ మౌనం దేనికి?

By:  Tupaki Desk   |   13 Dec 2022 10:42 AM GMT
ఆ న‌టి పై విశాల్ మౌనం దేనికి?
X
అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే ఇప్ప‌టికే విశాల్ పెళ్లి చేసుకుని కుటుంబ‌రావు అయిపోయేవాడు. ఇద్ద‌రి పిల్ల‌ల‌కి తండ్రి కూడా అయిపోయేవాడు. కానీ ఆయ‌న‌కు ఇంకా పెళ్లి గ‌డియ‌లు రాలేదు. అందుకే ఇంకా పెళ్లి జ‌ర‌గ‌లేదు అన్న‌ది వాస్త‌వం. ఆ మ‌ధ్య హైద‌రాబాద్ కి చెందిన ఓ తెలుగ‌మ్మాయితో విశాల్ నిశ్చితార్ధం జ‌ర‌గ‌డం...అది ర‌ద్ద‌వ్వ‌డం సంగ‌తి తెలిసిందే.

పెళ్లికి ముహూర్తాలు పెట్టే స‌మ‌యంలో పొర‌పొచ్చాలు రావ‌డంతో ఆ బంధం అక్క‌డితో వీగిపోయింది. ఆ త‌ర్వాత విశాల్ మ‌ళ్లీ పెళ్లి గురించి స్పందించింది లేదు. కుటుంబ స‌భ్యుల చూసిన అమ్మాయిని మాత్ర‌మే చేసుకుంటాన‌ని ఓసంద‌ర్భంలో అన్నారు. అయితే ఈ మ‌ధ్య‌నే న‌టి అభిన‌య‌తో ప్రేమ‌లో ఉన్న‌ట్లు నెట్టింట జోరుగా ప్ర‌చారం సాగుతోంది.

అక్క‌..చెల్లి..త‌ల్లి పాత్ర‌లు పోషించే అభిన‌య‌తో విశాల్ ప్రేమ అన‌గానే కాస్త షాక్ అయినా మీడియా క‌థ‌నాల నేప‌థ్యంలో న‌మ్మాల్సి వ‌చ్చింది. అభిన‌య మూగ..మాట‌లు కూడా రావు. అయినా ప్రేమ‌కి వైక‌ల్యంతో ప‌నేముంది? ఆ కోవ‌లో ఇద్ద‌రూ ప్రేమ ప‌డిన‌ట్లు ప్ర‌చారం సాగింది. అయితే ఈ క‌థ‌నాల‌కు ఓ కార‌ణం కూడా ఉంది. 'మార్క్ ఆంటోని' చిత్రంలో విశాల్ కి అభిన‌య భార్య పాత్ర పోషించింది.

అప్ప‌టి నుంచే ప్రేమ క‌లాపాలు తెర‌పైకి వ‌చ్చాయి. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాల గురించి ప్ర‌శ్నిస్తే వాటిని స్కిప్ కొట్టాడు విశాల్. అభిన‌య గురించి మాట్లాడేందుకు నిరాక‌రించాడు. పెళ్లి ఎప్పుడు అని అడిగితే ప్ర‌భాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటే అప్పుడే తాను పెళ్లి చేసుకుంటాన‌ని ఓన‌వ్వు న‌వ్వేసి ఎస్కేప్ అయ్యాడు. దీంతో అభిన‌య‌తో విశాల్ డేటింగ్ వార్త‌లు మీడియాలో మ‌రోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

ఇద్ద‌రి మ‌ధ్య ఏమీ లేనప్పుడు స్పందించ‌డానికి ఇబ్బంది ఏమి ఉంది? నిజంగా ఏదైనా ఉంటే చెప్ప‌డానికి స‌మస్య ఏంటో? అంటూ సందేహిస్తున్నారు. మీడియా క‌థ‌నాల‌కు బ‌లం తోడైంది. ఇక ప్ర‌భాస్ వ‌య‌సు 43 కాగా ..విశాల్ కి 45 వ‌చ్చేసాయి. ఇద్ద‌రు స్టిల్ బ్యాచిల‌ర్స్. ప్రభాస్ పెళ్లి విషయంలో ఎలాంటి ప్ర‌య‌త్నాలు క‌నిపించ‌లేదు. అత‌ను చేసుకుంటాడో? లేదో? కూడా క్లారిటీ లేదు. ఈనేప‌థ్యంలో విశాల్ డార్లింగ్ పెళ్లితో త‌న పెళ్లి ముడిపెట్ట‌డంతో? ఇత‌ను ఓ ఇంటివాడు అయిన‌ట్లేన‌ని సెటైర్లు ప‌డుతున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.