Begin typing your search above and press return to search.
విశ్వనాథ్ తన మొదటి సినిమా ఫస్ట్ షాట్ ను అద్దం మీద ఎందుకు తీశారు?
By: Tupaki Desk | 4 Feb 2023 1:00 PM GMTతెలుగు సినిమాను శిఖర స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో ముఖ్యులు కె.విశ్వనాథ్. అప్పటివరకు వచ్చిన సినిమాలను సరికొత్త కోణంలో చూసేలా చేసిన ఘనత ఆయన సొంతం. అలాంటి ఆయన తన మొదటి చిత్రం తొలి షాట్ ను చిత్రీకరించిన వైనం గురించి తెలిస్తే.. తాను నమ్మిన దానిని నెరవేర్చుకోవటం కోసం ఆయన ఎంతలా తపిస్తారో? ఎంతకూ రాజీ పడకుండా చేస్తారన్నది అర్థమవుతుంది. అదే సమయంలో.. నొప్పించక నొవ్వక సూత్రాన్ని ఆయన ఎంతలా ఫాలో అవుతారో విశ్వనాథ్ వర్కు స్టైల్ ను చూస్తే అర్థమవుతుంది.
కె. విశ్వనాథ్ తొలి చిత్రం ఆత్మగౌరవం. దర్శకుడిగా ఆయనకు అదే మొదటి చిత్రం. మరి.. తన తొలి చిత్రం తొలి షాట్ ను ఆయన తనకు నచ్చినట్లుగా తీయాలనుకుంటారు కదా? కానీ.. ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న దుక్కిపాటికి ఇబ్బంది కలగకుండా చేయటం అంత తేలికైన విషయం కాదు.
సాధారణంగా మొదటి షాట్ ను దేవుడి పటాల మీద షూట్ చేస్తారు. కానీ.. నిర్మాత దుక్కిపాటి నాస్తికులు కావటం.. అలాంటి వాటికి ఆయన ససేమిరా అనే రకం. మరోవైపు దర్శకుడు విశ్వనాథ్ పక్కా ఆస్తికుడు.
నిర్మాతను నొప్పించకుండా.. తాను నమ్మిన సెంటిమెంట్ కు తగ్గట్లే మొదటి షాట్ ను షూట్ చేయాలని డిసైడ్ అయ్యారు విశ్వనాథ్. అందులో భాగంగా ఆయన చేసిన ఆలోచన తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.
మొదటి రోజు షూటింగ్ హైదరాబాద్ సారథి స్టూడియోలో జరుగుతుంది. దేవుడి సెంటిమెంట్ మిస్ కాకుండా షాట్ తీయాలన్నది విశ్వనాథ్ ఆలోచన. అందుకు నిర్మాత నో చెప్పని రీతిలో షాట్ ఉండేందుకు ఆయన తెగ ఆలోచించారు. చివరకు ఆయనకో ఆలోచన తట్టింది.
హిందువులు అద్దాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే తన తొలి షాట్ ను అద్దం మీద తీసి.. దాన్ని జూమ్ ఔట్ చేస్తూ.. ఆ అద్దంలో అక్కినేని నాగేశ్వరరావును ఫ్రేమ్ లో కనిపించేలా తొలిషాట్ ను తీశారు. తాను నమ్మిన సెంటిమెంట్ ను తూచా తప్పకుండా ఫాలో అవుతూ.. నిర్మాత మనసు నొప్పించకుండా ఉండేలా షాట్ పూర్తి చేయటం చూస్తే. కె.విశ్వనాథ్ చాకచక్యం ఎంతన్నది ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.