Begin typing your search above and press return to search.

రూ.250 పెట్టి కొన్న బూర‌తో దేవీశ్రీ ప్ర‌యోగం

By:  Tupaki Desk   |   10 Jan 2023 3:52 AM GMT
రూ.250 పెట్టి కొన్న బూర‌తో దేవీశ్రీ ప్ర‌యోగం
X
సంగీతంలో సృజ‌నాత్మ‌క‌త‌పై బోలెడ‌న్ని సందేహాలు! దీనిపై టాలీవుడ్ లో పెద్ద ఎత్తున డిబేట్ జ‌రుగుతోంది. కాపీ క్యాట్ వ్య‌వహారాలపై నిరంత‌రం ఏదో ఒక వివాదం రాజుకుంటూనే ఉంది. ఒక ఏ.ఆర్.రెహ‌మాన్ .. హ్యారిష్ జైరాజ్.. యువ‌న్ శంక‌ర్ .. అనిరుధ్ లా యూనిక్ నెస్ తో వేవ్ లు టాలీవుడ్ లో పుట్టుకురావడం లేద‌న్న విమ‌ర్శ చాలా కాలంగా ఉంది. కీర‌వాణి- మ‌ణిశ‌ర్మ త‌ర్వాత‌ దేవీశ్రీ ప్ర‌సాద్ - థ‌మ‌న్ లాంటి వాళ్లు మ్యానేజ్ చేస్తున్నారు కానీ కొత్త ట్యాలెంట్ ఇక్క‌డ పుట్టుకు రావ‌డం లేద‌న్న‌ది కూడా నిజమ‌ని అంగీక‌రించాలి. ఇటీవ‌ల కీర‌వాణి వార‌సుడు కాల‌భైర‌వ కొంత హోప్ నిచ్చాడు. అడ‌పాద‌డ‌పా యువ సంగీత ద‌ర్శ‌కులు ఫ‌ర్వాలేద‌నిపించినా రెహ‌మాన్ లాగా వేవ్ క్రియేట్ చేసేది ఎవ‌రు? అన్న‌ ప్ర‌శ్నకు ఎప్ప‌టికీ స‌మాధానం లేదు. టాలీవుడ్ కి సిస‌లైన సంగీత‌ద‌ర్శ‌కుల కొర‌త స్పష్ఠంగా క‌నిపిస్తోంది. ప్ర‌తిసారీ పొరుగు నుంచి ఎవ‌రో ఒక‌రిని తెచ్చుకోవ‌డం త‌ప్ప ఇక్క‌డి ప్ర‌తిభ స‌రిపోవ‌డం లేదు. కొంద‌రు ప్ర‌తిభావంతులు కృష్ణాన‌గ‌ర్ - ఫిలింన‌గ‌ర్ లో ఉన్నా కానీ వారి పేర్ల‌కు స‌రైన ప్రాచుర్యం ద‌క్క‌డం లేదు.

ఇక‌పోతే ఇలాంటి స‌మ‌యంలో మొన్న వాల్తేరు వీర‌య్య ప్రీరిలీజ్ వేడుక‌లో సీనియ‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు దేవీశ్రీ ప్రసాద్ ఎమోష‌న‌ల్ అయిన తీరు చూశాక‌ సంగీత ప్రియుల్లో ర‌క‌ర‌కాల డౌట్లు పుట్టుకొచ్చాయి. అత‌డు బాస్ చిరంజీవి ముందే లైవ్ లో మాట్లాడుతూ చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడు. సంగీత సృజ‌న గురించి దేవీశ్రీ అదిరిపోయే క్లాస్ తీస్కున్నాడు. అంతేకాదు.. తాను ట్యూన్ ని ఎలా క్రియేట్ చేస్తాడో ప్రాక్టికల్ గా వేదిక‌పై చేసి చూపించాడు. త‌న‌దైన ప్ర‌తిభ‌తో అంద‌రి మెప్పు పొందాడు. అస‌లు మ‌న సంగీతంలో క్రియేటివిటీ అనేది ఉందా? అని సందేహిస్తున్న వేళ దేవీశ్రీ ఇలా ప్రాక్టిక‌ల్ గా ఎమోష‌న‌ల్ గా వేదిక‌పైనే ఆన్స‌ర్ ఇవ్వాల‌నుకోవ‌డం ఆస‌క్తిని క‌లిగించింది.

అత‌డు త‌న మ‌న‌సులో మాట‌ను కూడా కాస్త స్ట్రాంగ్ గానే చెప్పాడు. "సంగీతం ఇన్ స్ట్రుమెంటులో ఉండ‌దు.. మ‌న గుండె కాయ‌లో ఉంట‌ది..మ‌న మ‌న‌సులోంచి బ‌య‌టికొస్తే సంగీతం!" అంటూ దేవీశ్రీ కాస్త ఎమోష‌న‌ల్ గానే వేదిక‌పై కుండ బ‌ద్ధ‌లు కొట్టాడు. అది కూడా బూర మ్యూజిక్ లో త‌న క్రియేటివిటీని బ‌య‌ట‌పెట్టాడు. ఒక విధంగా చెబితే అప్ప‌టివ‌రకూ ఎంతో ఎన‌ర్జిటిక్ గా డ్యాన్సులు చేస్తూ పాట‌లు పాడుతూ అల‌రించిన దేవీశ్రీ సంగీతంపై స‌డెన్ గా స్పీచ్ ఇవ్వ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆ స‌మ‌యంలో దేవీలోని ఉగ్ర‌రూపం బ‌య‌ట‌ప‌డింది.

త‌న చేతిలో ఉన్న ఒక ప‌చ్చ‌ బూర‌ను అంద‌రికీ చూపిస్తూ దాని గురించి ఆస‌క్తిక‌ర సంగ‌తి ఒక‌టి చెప్పాడు. ఇది ఒక ప్లాస్టిక్ బూర‌. నేను ఏ ఊరు వెళ్లినా అక్క‌డ మ్యూజిక్ ఇన్ స్ట్రుమెంట్ ఏదో ఒక‌టి కొంటాను. అలా మొన్న గోవా వెళ్లిన‌ప్పుడు కొన్నాను ఇది. అక్క‌డ ప‌రిస‌రాల్లో తిరిగేప్పుడు ఒక చిన్న బూర దొరికింది. అది ప‌చ్చ రంగు బూర‌. చిన్న పిల్ల‌లు ఊదుకునే బూర‌. కేవ‌లం రూ.250 కే కొన్నాను. దీంతో ఏం క్రియేట్ చేయగ‌ల‌ను అని చాలా సేపు ఆలోచించాను. చివ‌రికి ఐడియా త‌ట్టింది! బూర‌పై ప్ర‌యోగాలు చేసాను. అది ఫ‌లించింది అని దేవీశ్రీ తెలిపాడు.

సంగీతం ఇన్ స్ట్రుమెంటులో ఉండ‌దు.. మ‌న గుండె కాయ‌లో ఉంట‌ది.. అని నొక్కి ప‌లికిన దేవీశ్రీ కొంచెం కోపంగా కూడా క‌నిపించాడు. మ‌న మ‌న‌సులోంచి బ‌య‌టికొస్తే సంగీతం..! అంటూ గ‌ట్టిగానే క్లాస్ తీస్కున్నాడు. అయితే ఆ రోజు దేవీశ్రీ కౌంట‌ర్ ఎవ‌రినుద్ధేశించి అన్న‌ది ఎవ‌రూ గెస్ చేయ‌లేక‌పోయారు. కానీ ఈవెంట్ లో అత‌డు విసిరిన ప్ర‌తి పంచ్ త‌గ‌లాల్సిన చోట త‌గిలింద‌ని ఇప్పుడు గుస‌గుస వినిపిస్తోంది. సంగీతం అంటే కాపీ పేస్ట్ లే కాదు అప్పుడ‌ప్పుడు అయినా ఏ.ఆర్. రెహమాన్ లాగా శూన్యం నుంచి సంగీత ధ్వనుల‌ను వినాల‌ని.. బూర ప్ర‌యోగాలు చేయాల‌ని ఆ స‌న్నివేశం అర్థ‌మ‌య్యేలా చెప్పింది. వేదిక‌పై లైవ్ పెర్ఫామెన్స్ ఇస్తూ ఒక చిన్న పిల్లాడి ఇన్ స్ట్రుమెంట్ అయిన 'బూర' నుంచి సంగీతం ఎలా పుట్టించ‌గ‌లిగాడో దేవీ శ్రీ వివ‌రించిన తీరు చాలా ఆక‌ట్టుకుంది. వేదిక‌పై పాట‌లు పాడుతూ డ్యాన్సులాడుతూ ప‌చ్చ బూర‌తో చాలా మ్యాజిక్ చేసాడు. తుత్త‌ర తుత్త‌ర తూరా... అంటూ బూర పాట‌ను భ‌లేగా వినిపించాడు. చిరంజీవిని చూసిన‌ప్పుడ‌ల్లా చిన్న సైజ్ పూన‌కం పెద్ద సైజ్ పూన‌కంగా మారుతుంది! అంటూ చిరు ముందే ఈ ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పారు అంతా.

నేను చేసిన ఫ‌స్ట్ మాస్ పాట ఎవ‌రికో తెలుసా?మాస్ మ‌హారాజా కే...నాతో పెట్టుకుంటే మ‌డ‌త‌డిపోద్దే.. ఒంట్లో ఒక్కో న‌రం మెలిక‌డిపోద్దే పాట‌కు సంగీతం ఇచ్చాన‌ని అప్ప‌టి నుంచి ర‌వితేజ‌తో క‌లిసి ప‌ని చేస్తున్నాన‌ని తెలిపాడు. రవితేజ‌కే గోంగూర తోట‌కాడ కాపు కాసా.. లాంటి చార్ట్ బ‌స్ట‌ర్ ని ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన శంక‌ర్ దాదా చిత్రానికి దేవీశ్రీ సంగీతం అందించాడు. ఖైదీనంబ‌ర్ 150 లాంట కంబ్యాక్ మూవీకి అమ్మ‌డు లెట్స్ డు కుమ్ముడు లాంటి చార్ట్ బ‌స్ట‌ర్ ని ఇచ్చాడు దేవీ. ఇప్పుడు చిరు- ర‌వితేజ‌ల‌ను క‌లుపుతూ ఒక పాట‌ను తెర‌కెక్కించ‌గా దానికోసం కొంత క్రియేటివ్ గా ఆలోచించిన దేవీశ్రీ 'బూర పాట‌'ను ఎంచుకున్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.