Begin typing your search above and press return to search.

చేతులు మారినా ఆ సినిమా రాట్లేదేం?

By:  Tupaki Desk   |   11 Oct 2021 2:30 AM GMT
చేతులు మారినా ఆ సినిమా రాట్లేదేం?
X
కీర్తి సురేష్‌ హీరోయిన్ గా ఆది పినిశెట్టి మరియు జగపతిబాబు లు కీలక పాత్రల్లో నటించిన గుడ్‌ లక్ సఖి సినిమా ఎప్పుడో ప్రారంభం అయ్యింది. కరోనా సమయంలోనే షూటింగ్ ముగించినట్లుగా వార్తలు వచ్చాయి. ఓటీటీ రిలీజ్ కు వెళ్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. సినిమాలో కీర్తి సురేష్ లుక్ మరియు ఇతర విషయాలతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందనే నమ్మకంను యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. కాని సినిమా విడుదల విషయంలో మాత్రం జాప్యం చేస్తూ వస్తున్నారు. నగేష్ కుకునూర్‌ రూపొందిన ఈ సినిమాకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దాంతో ఈ సినిమా ను దిల్‌ రాజు టేకోవర్ చేశాడని.. షూటింగ్‌ ను పూర్తి చేసి విడుదల చేసేందుకు ముందుకు వచ్చాడంటూ వార్తలు వచ్చాయి.

దిల్‌ రాజు కు చిత్ర నిర్మాతలు సినిమాను అప్పగించడంతో ఓటీటీ లేదా థియేటర్‌ ఏదో ఒక విధంగా కీర్తి సురేష్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంతా అభిప్రాయం వ్యక్తం చేశారు. కాని ఆరు నెలలు గడిచి పోయినా ఇప్పటి వరకు విడుదల విషయంలో స్పష్టత రావడం లేదు. దిల్‌ రాజు ఈ సినిమాను తీసుకున్నాడా లేదంటే నిర్మాతలే సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా అంటూ మళ్లీ చర్చలు జరుగుతున్నాయి. చేతులు మారిన తర్వాత కూడా సినిమా విడుదల విషయంలో ఇంకా ఒక స్పష్టత రాకపోవడం పట్ల కీర్తి సురేష్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓటీటీ లేదా థియేటర్‌ ఏదో ఒక మాద్యమం ద్వారా సినిమాను విడుదల చేస్తే బాగుంటుంది కదా అంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

కీర్తి సురేష్‌ మహానటి సినిమా తర్వాత స్టార్‌ హీరోయిన్ గా ఎదిగి పోయింది. ఆమె స్టార్‌ గా వరుసగా సినిమాలు చేస్తోంది. ఆ క్రమంలోనే లేడీ ఓరియంటెడ్‌ సినిమాలను మూడింటికి కమిట్ అయ్యింది. మూడు సినిమాల్లో పెంగ్విన్ ఓటీటీ ద్వారా విడుదల అయ్యింది. ఆ తర్వాత విడుదల అయిన మిస్ ఇండియా కూడా నిరాశ పర్చింది. సరే ఈ సినిమాతో అయినా ఆమె ప్రేక్షకులను అలరిస్తుందా అని ఎదురు చూస్తుండగా సినిమా అసలు ప్రేక్షకుల ముందుకు రాకుండానే ఉండి పోయింది. ఆ సినిమా అసలు వస్తుందా లేదా అనేది అనుమానంగా ఉంది. దిల్ రాజు తల్చుకుంటే సినిమా విడుదల అనేది పెద్ద విషయం కాదు. కాని ఆయన ఎందుకు ఈ సినిమా ను విడుదల చేయడం లేదు అంటూ కొందరు చెవులు కొరుక్కుంటూ ఉంటే మరి కొందరు మాత్రం ఆయన ఈ సినిమాను అసలు తీసుకున్నాడా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.