Begin typing your search above and press return to search.
భార్య సాక్షి రచయిత..ధోనీ నిర్మాత..ఆ సినిమా ఇదే!
By: Tupaki Desk | 25 Oct 2022 5:59 AM GMTమాజీ క్రికెటర్ ఎమ్మెస్ ధోనీ సినిమా నిర్మాణంలోకి అడుగుపెడుతున్నట్లు కొన్ని నెలలుగా ప్ర చారం సాగుతోన్న సంగతి తెలిసిందే. క్రికెట్ రంగంలో పెద్ద స్టార్ అయినా ధోనీ ఎంట్రీ మాత్రం బాలీవుడ్ లో కాకుండా ఓ కోలీవుడ్ సినిమాతో లాంచ్ అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. తొలి సినిమానే ఏకంగా తలపతి విజయ్ తోనే నిర్మిస్తున్నట్లు వార్తలొచ్చాయి.
ఐపీఎల్ లో భాగంగా తమ తమినాడు రాష్ర్టంతో ముడిపడిన అనుబంధంతో ధోనీ ఈ రకమైన నిర్ణయంతో ముందుకొస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. మరి ఇదంతా నిజమేనా? ధోనీ ఎంట్రీ ఖరారరైందా? అంటే అవుననే అంటున్నారు ధోని. నిర్మాతగా మారుతోన్న విషయాన్ని ధోనీ అధికారికంగా ప్రకటించారు.
ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తాను మరియు అతని భార్య సాక్షి సింగ్ ధోనీ సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నట్లు ఎంఎస్ ధోని రివీల్ చేసారు. తమ మొదటి సినిమాని అథర్వ-ది ఆరిజిన్ రచించిన నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి రమేష్ తమిళమణి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇందులో హీరో ఎవరు? ఎన్ని భాషల్లో చిత్రాన్ని తెరకెక్కిస్తారు? వంటి వివరాలు ఇంకా రివీల్ చేయలేదు.
కానీ ధోనీ క్రేజ్ నడుమ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అన్ని భాషల్లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. క్రికెటర్ గా అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించిన ఓ లెజెండ్. ఇండియాకి వరల్డ్ కప్ తీసుకొచ్చిన ఆదర్శ కెప్టెన్. క్రికెట్ లో అన్ని ఫార్మెట్ లోనూ రాణించిన ఆడగాడు. చెన్నైజట్టుకి ప్రాతినిధ్యం వహించి సౌత్ రాష్ర్టాలకు మరింత దగ్గరయ్యాడు.
ఇండియన్ టీమ్ నే శాషించిన గొప్ప ఆటగాడు. మరి అలాంటి ధోని నిర్మాణ రంగంలో ఎంత వరకూ సక్సెస్ అవుతాడు? అన్నది చూడాలి. సినిమాలపై తన ష్యాషన్ ఎలా ఉంటుందన్నది తెలియాలి. బ్యానర్లోనూ మరోసారి తన క్రికెట్ ఫ్యాషన్ ని చూపించారు. `డి` అనే ఇంగ్లీష్ లెటర్ పై లోగోలో కెమెరాపై రెండు టెస్ట్ బంతుల్ని పెట్టి లోగో డిజైన్ చేసాడు.
మరి ఈ వరల్డ్ ఫేమస్ కీపర్ ఎలాంటి కంటెంట్ తో ప్రేక్షకుల్ని మెప్పిస్తాడో చూడాలి. ధోనీ కున్న క్రేజ్ నేపథ్యంలో అన్ని భాషల స్టార్లు ఆయన్ని ప్రోత్సహిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన సినిమాలన్నింటికి హీరోలు వెనుకుండి సహకారం అందించడానికి అవకాశం ఉంది. అయితే ధోనీ డెబ్యూకి భార్య సాక్షి సింగ్ కథ అందించడం విశేషం. ఆమె మంచి రచయిత. ఆ ఫ్యాషన్ తోనే దోనీ కోసం మరోసారి కలం పట్టారు. మరి భర్తని నిర్మాతగా సక్సెస్ చేయడంలో సాక్షి ఎలాంటి పాత్ర పోషిస్తుంది అన్నది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.