Begin typing your search above and press return to search.

మొగలిరేకులు’ సీరియల్ నటుడిపై భార్య షాకింగ్ కామెంట్స్

By:  Tupaki Desk   |   19 Oct 2021 11:30 PM GMT
మొగలిరేకులు’ సీరియల్ నటుడిపై భార్య షాకింగ్ కామెంట్స్
X
మొగలిరేకులు సీరియల్ ఫేమ్ పవిత్రనాథ్ రాసలీలలు బయటపెట్టింది అతడి భార్య శశిరేఖ. రీల్ లైఫ్ లో మొగలిరేకులు దయగా పేరొందిన ఇతడికి రియల్ లైఫ్ లో దయ అన్నదే లేదని చెప్తూ తన కన్నీటిగాథను చెప్పుకుందామే.. నా భర్తకు అమ్మాయిల పిచ్చి అంటూ మొగలిరేకులు సీరియల్ నటుడు దయా బాగోతాన్ని అతడి భార్య బయటపెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది.

తెలుగు టీవీ సీరియల్స్ లో టాప్ సీరియల్స్ లో ఒకటైన మొగలిరేకులులో దయా పాత్రలో నటిస్తున్న నటుడు పవిత్రనాథ్ బాగోతాన్ని అతడి భార్య వివరించింది. జాతకం పేరుతో బెడ్ రూంలోకి అమ్మాయిలను తీసుకువస్తాడని.. తను పక్కన ఉండగానే వారితో రాసలీలలు నడిపేవాడని ఆయన భార్య సంచలన ఆరోపణలు చేసింది.

అలాగే అమ్మాయిలతో చాటింగ్ తెల్లవారే వరకూ ఫోన్లు చేస్తుండేవాడని.. అడ్డు చెప్పానని చావ కొట్టేవాడని పవిత్రనాథ్ భార్య ఆరోపించింది. గోడకేసి కొట్టేవాడని వాపోయింది. ఇక తనకు అత్తామామలు ఉన్న కొడుకుకే వత్తాసు పలికేవారని.. రివర్స్ లో తనపైనే కేసు పెట్టారని వివరించింది.

ఇక భరించలేనంటూ న్యాయస్థానం మెట్లేక్కింది ఈ బాధిత మహిళ. 11 ఏళ్లుగా భరిస్తున్నా మారని తీరుతో విసుగెత్తిపోయిన ఆ మహిళ న్యాయం కావాలంటోంది. నా బిడ్డలకు న్యాయం చేయమని రోధిస్తున్న సంఘటన అందరిలో వేదన కలిగిస్తోంది. ఓ యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దయ విలనిజం గురించి ఆమె పలు షాకింగ్ విషయాలను వెల్లడించింది.

ఆమె చెప్పిన దాని ప్రకారం టీవీ సీరియల్ లో దయ పాత్రలో నటించి అభిమానుల ఆదరణ చూరగొన్న పవిత్రనాథ్ నిజజీవితంలో పెద్ద విలన్ అని ఆమె అన్నారు. పవిత్రనాథ్ తో తనకు 2009లో పెళ్లి జరిగిందని.. అప్పటికే అతడికి అమ్మాయిల పిచ్చి ఉండేదని తెలిపింది.