Begin typing your search above and press return to search.
'వైల్డ్ డాగ్' తెర వెనుక కథ..!
By: Tupaki Desk | 3 April 2021 1:30 PM GMT'కింగ్' అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ ''వైల్డ్ డాగ్'' నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు అహిషోర్ సాల్మన్ తెరకెక్కించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ 'వైల్డ్ డాగ్' తెర వెనుక కథను వివరిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. 'వైల్డ్ డాగ్స్ ని వేటాడడానికి ఉపయోగిస్తుంటారు. ఇందులో ఏసీపీ విజయ్ వర్మ పాత్ర కూడా టెర్రరిస్టులు వేటాడుతుంటాడు. అందుకే ఈ చిత్రానికి వైల్డ్ డాగ్ అనే పేరు పెట్టాం' అని దర్శకుడు వివరించారు. 'విజయ్ వర్మ టెర్రరిస్టులను అరెస్ట్ చేయడం లాంటివి నమ్మడు.. వాళ్ళని చంపేయడమే కరెక్ట్ అని భావిస్తుంటాడు' అని తెలిపారు.
కాగా, హైదరాబాద్ లో జరిగిన గోకుల్ చాట్ - లుంబిని పార్క్ వంటి బాంబు దాడుల వెనుక ప్రధాన సూత్రదారులను పట్టుకునే నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ దియామీర్జా నటించింది. సయామీ కేర్ - అతుల్ కులకర్ణి - ఆలీ రెజా - ప్రకాష్ సుదర్శన్ - బిలాల్ హుస్సేన్ - ఆర్యా పండిట్ - కాలెబ్ మాథ్యూస్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకి థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సమకూర్చారు. షానెల్ డియో సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ వర్క్ చేశారు. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ డేవిడ్ - బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ శ్యామ్ కౌశల్ ఈ చిత్రానికి వర్క్ చేశారు. నాగార్జున కెరీర్ లో మరో వైవిధ్యమైన సినిమాగా వచ్చిన ''వైల్డ్ డాగ్'' ఈ వీకెండ్ లో మంచి వసూళ్ళు రాబట్టే అవకాశం ఉంది కనిపిస్తున్నాయి.