Begin typing your search above and press return to search.
'వైల్డ్ డాగ్' క్రేజీ అప్డేట్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?
By: Tupaki Desk | 20 March 2021 10:37 AM GMTఆరు పదుల వయసు దాటినా.. ఇంకా టాలీవుడ్ మన్మథుడిగా కంటిన్యూ అవుతున్నారు నాగార్జున. ఆయన అప్ కమింగ్ మూవీ 'వైల్డ్ డాగ్'. మొదటగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకొని.. సంక్రాంతికే ప్రీమియర్స్ అనుకున్న తర్వాత పరిస్థితులు మొత్తం మారిపోయాయి. ఇండస్ట్రీ ఊహించినదానికన్నా వేగంగా ప్రేక్షకులు థియేటర్ కు రావడానికి సిద్ధమవడంతో.. వైల్డ్ డాగ్ మేకర్స్ కూడా మనసు మార్చుకున్నారు.
నెట్ ఫ్లిక్స్ తో చేసుకున్న ముందస్తు ఒప్పందాలను రద్దుచేసుకొని.. థియేటర్లోనే రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. అన్నీ సెట్ చేసుకుని, రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు. ఈ క్రమంలో వైల్డ్ డాగ్ కు సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది. ఇది విన్న కొందరు అభిమానులు అవునా? అని ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.
ఈ చిత్రంలో నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారిగా నటిస్తున్నారు నాగ్. టెర్రరిస్టులను ఏరిపారేసే గట్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఈ క్రమంలో దేశంలో జరిగిన ప్రముఖ టెర్రరిస్టు బ్లాస్టులను కూడా చూపించబోతున్నారట. హైదరాబాద్ ను వణికించిన గోకుల్ ఛాట్ బాంబు పేలుడు ఘటన కూడా ఇందులో ఉంటుందట.
అయితే.. ఈ సినిమాలో నాగ్ తోపాటు దియా మార్జీ, సయామీ ఖేర్ నటిస్తున్నారు. ఈ బ్యూటీస్ అందాలు ఆరబోయడానికి ఏమాత్రం మొహమాట పడరు. కానీ.. దర్శకుడు సిద్ధపడలేదని తెలుస్తోంది. దీంతో.. ఒక్క పాటకూడా లేకుండా వైల్డ్ డాగ్ సినిమా వస్తోందని సమాచారం. నాగార్జున అంటేనే గ్లామర్. అలాంటి హీరో సినిమాలో ఒక్క పాటకూడా లేకుండా రావడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
కాగా.. ఈ విషయాన్ని కూడా యూనిట్ డిస్కస్ చేసిందట. కానీ.. ఆద్యంతం సీరియస్ గా, ఎమోషనల్ గా సాగే సినిమాను డిస్ట్రబ్ చేయకూడదనే ఉద్దేశంతోనే పాటలకు అవకాశం కల్పించలేదని సమాచారం. మరి, దీన్ని ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? అన్నది చూడాలి. ఈ మూవీని ఏప్రిల్ 2న థియేటర్లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.