Begin typing your search above and press return to search.
'వైల్డ్ డాగ్' ఫస్ట్ డే కలెక్షన్స్..!
By: Tupaki Desk | 3 April 2021 7:30 AM GMTటాలీవుడ్ కింగ్ నాగార్జున చివరిగా నటించిన సినిమా 'మన్మధుడు-2'. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బకొట్టింది. ఆ సినిమా తర్వాత నాగ్ ఓ లాంగ్ బ్రేక్ తీసుకొని ఓ రియల్ ఇన్సిడెంట్స్ స్టోరీని ఓకే చేసాడు అదే 'వైల్డ్ డాగ్'. తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ ఓపెన్ అయ్యాక సినిమాలు ఎలా ఆడుతున్నాయో.. జనాలు వస్తున్నారా లేదా అనేది గమనించి వైల్డ్ డాగ్ రిలీజ్ డేట్ ఖరారు చేశారు మేకర్స్. మొత్తానికి వైల్డ్ డాగ్ మూవీ ఏప్రిల్ 2న విడుదలైంది. నిజానికి సినిమా విడుదలకు ముందే వైల్డ్ డాగ్ ట్రైలర్ సినిమా పై అంచనాలు అమాంతం పెంచేసింది. ఒకానొక సమయంలో ఈ సినిమాను ప్రముఖ ఓటిటిలో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి మంచి కలెక్షన్స్ అందిస్తున్నారనే ధైర్యంతో వైల్డ్ డాగ్ మేకర్స్ థియేట్రికల్ రిలీజ్ డిసైడ్ చేశారు.
అయితే యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ స్టోరీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) బృందం చుట్టూ తిరుగుతుంది. కింగ్ నాగార్జున ప్రధానపాత్రలో విజయవర్మ అనే పాత్రలో నటించాడు. కొన్నేళ్లక్రితం హైదరాబాద్‌లో కల్లోలం సృష్టించిన ఓ రియల్ లైఫ్ ఉగ్రదాడిని ఎన్‌ఐఏ బృందం ఎలా చేస్ చేసింది అనే కథాంశంతో వైల్డ్ డాగ్ రూపొందింది. ఐతే ట్రైలర్ పరంగా సినిమా అంచనాలు బాగానే క్రియేట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఏరియాస్ ప్రకారం చూసుకుంటే.. ఈ సినిమా నైజాంలో 51లక్షలు, సీడెడ్ 18లక్షలు, నెల్లూరు 4లక్షలు, కృష్ణ 8లక్షలు, గుంటూరు 7లక్షలు, వైజాగ్ 15లక్షలు, ఈస్ట్ 7, వెస్ట్ 6లక్షలు కలిపి టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో వైల్డ్ కలెక్షన్స్ కోటి పదహారు లక్షలు(1.16cr)గా నిలిచింది. మరి రిజల్ట్స్ గురించి పక్కనపెడితే వైల్డ్ డాగ్ కలెక్షన్స్ మాత్రం ఈ విధంగా నమోదయ్యాయి. చూడాలి మరి ముందుముందు బెటర్ కలెక్షన్స్ రాబడుతుందేమో!