Begin typing your search above and press return to search.

ఓటీటీలో నాగ్ 'వైల్డ్ డాగ్' రికార్డ్స్..!

By:  Tupaki Desk   |   24 April 2021 6:10 AM GMT
ఓటీటీలో నాగ్ వైల్డ్ డాగ్ రికార్డ్స్..!
X
కింగ్' అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ''వైల్డ్ డాగ్''. అహిషోర్ సోలోమాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేయబడిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తోపాటుగా మంచి రివ్యూస్ తెచ్చుకుంది. ఈ క్రమంలో ఏప్రిల్ 21న ఈ చిత్రాన్ని డిజిటల్ రిలీజ్ చేశారు. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో 'వైల్డ్ డాగ్' సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియాలో అతి పెద్ద అండర్ కవర్ ఆపరేషన్ కథాంశంతో పాన్ ఇండియా కంటెంట్ తో తెరకెక్కిన 'వైల్డ్ డాగ్' చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విశేష ఆదరణ దక్కించుకుంటోంది.

ఈ నేపథ్యంలో తక్కువ టైం లో అత్యధిక వ్యూస్ రాబట్టిన సౌత్ సినిమాగా 'వైల్డ్ డాగ్' నిలిచింది. ప్రస్తుతం ఇండియా ట్రెండింగ్ లో తెలుగు వర్షన్ నెంబర్-1 ప్లేస్ లో ఉండగా.. తమిళ్ వెర్షన్ 5వ స్థానంలో ట్రెండింగ్ లో ఉంది. ఎన్‌ఐఏ బృందం సీక్రెట్ ఆపరేషన్‌ లో భాగంగా ఉగ్రవాదులను ఏరివేసే నేపథ్యంలో హైదరాబాద్ - పూణే బాంబు పేలుళ్లు వంటి వాస్తవ ఘటనల ఆధారంగా తీసిన సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై ఎక్కువ ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. ఎన్ఐఏ ఆఫీసర్ విజయ్ వర్మ పాత్రలో 'కింగ్' నాగార్జున నటన ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని చెప్పవచ్చు. 60 ఏళ్లు పైబడినా కుర్రహీరోలకు పోటీగా నాగ్ యాక్షన్ సీక్వెన్స్ లలో ఇరగదీశారు.

హై టెక్నికల్‌ వాల్యూస్ తో హాలీవుడ్ సినిమాని తలపించే విజువల్స్ తో ఈ సినిమా మేకింగ్ ఉంటుంది. దీనికి షానియల్ డియో సినిమాటోగ్రఫీ.. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ డేవిడ్ - బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ శ్యామ్ కౌశల్ ఈ చిత్రానికి వర్క్ చేశారు. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ వర్క్ చేయగా.. మురళి ఎస్వీ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా బాలీవుడ్ భామ దియామీర్జా నటించింది. సయామీ కేర్ - అతుల్ కులకర్ణి - ఆలీ రెజా - ప్రకాష్ సుదర్శన్ - దయానంద్ రెడ్డి - అనీష్ కురువిల్లా - అవిజిత్ దత్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.