Begin typing your search above and press return to search.
రేపు రిలీజ్ అవుతున్న 'వైల్డ్ డాగ్' ఈరోజు యూట్యూబ్ లో ప్రత్యక్షం..!
By: Tupaki Desk | 1 April 2021 4:06 PM GMT'కింగ్' అక్కినేని నాగార్జున నటిస్తున్న ''వైల్డ్ డాగ్'' సినిమా రేపు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే వినూత్నమైన ప్రచార కార్యక్రమాలతో సినిమాపై బజ్ క్రియేట్ అయింది. అలానే 'వైల్డ్ డాగ్' సినిమా స్పెషల్ షో చూసిన సినీ ప్రముఖుల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇక ప్రీమియర్స్ నుండి కూడా సూపర్ పాజిటివ్ స్పందన వస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. ఇండియాలోనే బిగ్గెస్ట్ అండర్ కవర్ ఆపరేషన్ ఆధారంగా రూపొందిన 'వైల్డ్ డాగ్' సినిమా రన్ టైం కూడా సినిమాకి కలిసొచ్చేలా ఉందని విశ్లేషకులు అంటున్నారు.
'వైల్డ్ డాగ్' సినిమా 2 గంటల 9 నిమిషాల క్రిస్పీ రన్ టైంతో రానుంది. ఇలాంటి అండర్ కవర్ యాక్షన్ బేస్డ్ థ్రిల్లర్స్ ఎక్కువ నిడివి లేకుండా క్రిస్పీగా ఉంటేనే ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఉత్కంఠగా చూడగలరు. మరి ఈ సినిమా ఆడియన్స్ ని ఏ మేరకు మెప్పిస్తుందనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇకపోతే ఈ సినిమా మేకర్స్ తాజాగా 'వైల్డ్ డాగ్' చిత్రం మొత్తాన్ని ఎవరో యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారని.. యూట్యూబ్ లో ఎవరూ చూడొద్దని.. రేపు థియేటర్లలోనే సినిమా చూడాలని విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియో లింక్ పోస్ట్ చేసింది. ఆ యూట్యూబ్ లింకు ఓపెన్ చేస్తే "రేపటి నుంచి థియేటర్లలో.. వైల్డ్ డాగ్" అనే సందేశం కనిపిస్తోంది. 2 గంటల 9 నిమిషాలు నిడివి ఉన్న ఆ వీడియోలో మొదటి నుంచి చివరి వరకు ఇదే సందేశం దర్శనమిసవ్వడం గమనార్హం. ఈ విధంగా వైల్డ్ డాగ్ యూనిట్ జనాలను ఏప్రిల్ ఫూల్స్ ని చేయడంతో పాటు తమ చిత్రానికి వినూత్న రీతిలో ప్రమోట్ చేసుకుంది.