Begin typing your search above and press return to search.
2.0 చైనాలో రికార్డులు బ్రేక్ చేస్తుందా?
By: Tupaki Desk | 8 Jun 2019 4:59 AM GMTప్రపంచీకరణ నేపథ్యంలో ఏ ఉత్పత్తిని ఎవరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు.. కొనుక్కోవచ్చు. ఇది వినోద పరిశ్రమకు మినహాయింపు ఏమీ కాదు. హాలీవుడ్ సినిమాల్ని టాలీవుడ్ లో అమ్మేస్తూ కోట్లకు కోట్లు ఆర్జిస్తున్నారు. ఇండియా వ్యాప్తంగా హాలీవుడ్ సినిమాల్ని రిలీజ్ చేస్తూ వందల కోట్లు కొల్లగొడుతున్నారు. ఇక హాలీవుడ్ వాళ్ల దండయాత్ర కేవలం అమెరికా- పాశ్చాత్య దేశాలకే పరిమితం కాదు. ఆసియాలో అన్ని దేశాల్ని ఆక్రమించి భారీ స్థాయిలో సినిమాల్ని రిలీజ్ చేసి క్యాష్ చేసుకుంటున్నారు. అయితే ఈ వార్ లో హాలీవుడ్ కి పోటీగా భారతీయ సినీపరిశ్రమ ఎదుగుతోందా? అంటే ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తున్న వైనం కనిపిస్తోంది. హాలీవుడ్ కి ధీటైన సినిమాల్ని తీస్తూ దేశ- విదేశాల్లో మన సినిమాలను రిలీజ్ చేస్తూ డాలర్ల వేట సాగిండంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఇటీవలే హాలీవుడ్ మూవీ `అవెంజర్స్- ది ఎండ్ గేమ్` అమెరికాకు ధీటుగా చైనాలో రిలీజై సంచలన విజయం సాధించింది. అక్కడ ఏకంగా 4163 కోట్లు (600 మిలియన్ డాలర్లు) వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇక భారతీయ సినిమాలకు చైనా మార్కెట్ అద్భుతంగా కలిసొస్తున్న సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్ నటించిన బాలీవుడ్ సినిమా `దంగల్` 1983 కోట్లు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత దంగల్ స్ఫూర్తితో రిలీజైన చాలా సినిమాలు విజయాలు సాధించాయి. అమీర్ నటించిన సీక్రెట్ సూపర్ స్టార్ దాదాపు 810 కోట్లు వసూలు చేసింది. భజరంగి భాయిజాన్ .. ఇంగ్లీష్ మీడియం.. మామ్ చిత్రాలు విజయం సాధించాయి. బాహుబలి రిలీజై ఆశించిన విజయం సాధించకపోయినా ప్రభాస్ - రానా లాంటి స్టార్లను అక్కడ ఎస్టాబ్లిష్ చేయడంలో విజయం సాధించారు. చైనాలో మన స్టార్లకు గుర్తింపు మొదలైంది.
ఇకపోతే ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ - శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన 2.0 చైనాలో జూలై 12న అత్యంత భారీగా రిలీజవుతోంది. ఇప్పటికే చైనీ భాషలో పోస్టర్లను డిజైన్ చేసిన లైకా సంస్థ ప్రచారంలోనూ వేడెక్కిస్తోంది. తాజాగా ట్విట్టర్ లో ఈ పోస్టర్ ని తరణ్ ఆదర్శ్ రివీల్ చేశారు. చైనా మార్కెట్లో 2.0 సత్తా ఎంత? ఒక సౌతిండియా డైరెక్టర్ (శంకర్) రూపొందించిన సినిమా ఏ స్థాయిలో ఆడబోతోంది? మన గ్రాఫిక్స్ స్టాండార్డ్స్ .. ఎమోషన్స్ చైనీయులకు ఏమేరకు నచ్చుతాయి? అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. 2.0 ఇతర ఇండియన్ సినిమాల రికార్డుల్ని చైనాలో బ్రేక్ చేస్తుందా.. లేదా? అన్నది వేచి చూడాల్సిందే.