Begin typing your search above and press return to search.

యువ దర్శకుల కు ఛాలెంజ్

By:  Tupaki Desk   |   19 Dec 2018 7:32 AM GMT
యువ దర్శకుల కు ఛాలెంజ్
X
టాలీవుడ్ లో ఇప్పుడు యంగ్ టాలెంట్ కి కొదవ లేదు. హీరో ఎవరైనా కొత్తా పాత అనే తేడా లేకుండా తమ ఆలోచనలను వెండితెర పై ఆవిష్కరిస్తున్న తీరు ప్రశంశల తో పాటు వసూళ్లు కూడా తెచ్చి పెడుతున్నాయి. అయితే సినిమా పరిశ్రమ సక్సెస్ తో ముడిపడింది. ఇక్కడ విజయం ఉన్నన్ని రోజుల బ్రహ్మరధం దక్కుతుంది. అది పోయిన రోజు కాశీ తీర్థం అందుతుంది. అందుకే ట్రాక్ రికార్డు తో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్త సవాళ్ళను స్వీకరించాల్సిందే. ఇప్పుడు ఈ విషయంలో 2018 తమ డెబ్యూలతో సూపర్ సక్సెస్ అందుకున్న ముగ్గురు దర్శకులు ఒకేరకమైన సవాల్ ను ఎదురుకుంటున్నారు.

వరుణ్ తేజ్ తొలిప్రేమ తో ఇండస్ట్రీ దృష్టిని ఆకట్టుకున్న వెంకీ అట్లూరి అక్కినేని వారసుడు అఖిల్ తో మిస్టర్ మజ్ను చేస్తున్న సంగతి తెలిసిందే. మూడేళ్ళలో కేవలం రెండే సినిమాలు చేసి వాటినీ డిజాస్టర్లు చేసుకున్న అఖిల్ కు ఒక పెద్ద హిట్ చాలా అవసరం. అది వెంకీ తీరుస్తాడనే నమ్మకంతోనే లేట్ అయినా మిస్టర్ మజ్ను పట్టాలు ఎక్కే దాకా అఖిల్ వెయిట్ చేసి మరీ దీనికి రెడీ అయ్యాడు. మరో పక్క లిమిటెడ్ బడ్జెట్ లో అన్ లిమిటెడ్ ఫన్ అందించి నాగ శౌర్యకు ఒక మార్కెట్ ని ఇచ్చి రష్మిక మందన్న లాంటి బ్యూటీని టాలీవుడ్ కు పరిచయం చేసిన వెంకీ కుడుముల ఇప్పుడు నితిన్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. లై-చల్ మోహనరంగ-శ్రీనివాస కళ్యాణం వరస దెబ్బలకు డౌన్ లో నితిన్ కు సాలిడ్ హిట్ పడాల్సిన తరుణంలో ఆ బాధ్యత వెంకీ కుడుములు మీద పడింది. షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్న ఈ మూవీ లో రష్మికనే హీరోయిన్.

ఇక నాని నిర్మించిన అ! లాంటి టిపికల్ స్టోరీ తో పరిచయమైన ప్రశాంత్ వర్మ రాజశేఖర్ తో కల్కి చేస్తున్నాడు. ఒకప్పుడు గ్యారెంటీ హీరో గా ఉన్న సీనియర్ హీరో గా రాజశేఖర్ కు మంచి మార్కెట్ ఉండేది. చాలా ఏళ్ళ తర్వాత గరుడవేగా సక్సెస్ అనిపించుకున్నా కమర్షియల్ లెక్కల్లో నష్టాలు తప్పలేదు. అయినా అది ఆయన రేంజ్ హిట్ అయితే కాదు. సో ప్రశాంత్ వర్మ కు ఇది చిన్న భారం కాదు. సో ఈ ముగ్గురు యువ దర్శకులు తమ రెండో సినిమాల్లో హీరోలకు అర్జెంటుగా హిట్ కావలసిన టార్గెట్ ను ఎలా ఛేదిస్తారో ద్వితీయ విఘ్నాన్ని ఎలా దాటుకుంటారో వచ్చే ఏడాది తేలిపోతుంది