Begin typing your search above and press return to search.
2023 బాలీవుడ్ కి పూర్వ వైభవం తెస్తుందా?
By: Tupaki Desk | 24 Dec 2022 1:30 AM GMT2023 ప్రథమార్థంలో విడుదలయ్యే బాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలను నమోదు చేస్తాయా? అంటే అవుననే ఆశాభావం వ్యక్తమవుతోంది. 2022 బాలీవుడ్ కి ఏమాత్రం కలిసి రాలేదు. ఒకట్రెండు విజయాలతో సక్సెస్ 2 శాతానికి పడిపోయింది. దీంతో హిందీ పరిశ్రమ అగ్రజులు తీవ్రంగా బెంగ పెట్టుకున్నారు. కనీసం 2023 లో అయినా కంబ్యాక్ సాధ్యమవుతుందా? అంటూ కలతలో ఉన్నారు.
అయితే బాలీవుడ్ లో 2023 ప్రథమార్థంలో విడుదలయ్యే భారీ చిత్రాలు సంచలనాలు నమోదు చేస్తాయని భావిస్తున్నారు. పఠాన్- షెహజాదా- టైగర్ 3- జవాన్ లాంటి భారీ చిత్రాలు హిట్ అవుతాయని పరిశ్రమకు పూర్వ వైభవం తెస్తాయని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.
గతించిన ఏడాది బాలీవుడ్ కి కలిసిరాకపోయినా కొత్త సంవత్సరం ఆరంభమే చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. పలువురు క్రేజీ హీరోలు నటించిన సినిమాలు భారీ లైనప్ తో థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నందున అంతా చాలా ఆశలు పెట్టుకున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్ని నమోదు చేసి లాభాల్ని కళ్లజూడాలని ఉత్తరాది పంపిణీ వర్గాలు ఆశిస్తున్నాయి. అన్నివైపుల నుంచి విమర్శకులకు సమాధానమిచ్చేలా బాలీవుడ్ తనను తాను పునరుద్ధరించుకోగలదనే ఆశ ఇప్పటికీ ఇంకా సజీవంగా ఉంది.
సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న `పఠాన్` లాంటి భారీ సినిమాతో 2023 ఘనంగా ఆరంభం కానుంది. కింగ్ ఖాన్ షారుఖ్ - దీపికా పదుకొణె - జాన్ అబ్రహం నటించిన ఈ చిత్రం 25 జనవరి 2023న థియేటర్లలోకి రాబోతోంది. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత SRK పునరాగమనంపై క్యూరియాసిటీ నెలకొంది. అతడి అభిమానులలో గొప్ప ఉత్సాహం నెలకొంది.
యువహీరో కార్తిక్ ఆర్యన్ చిత్రం షెహజాదా 2023 ఫిబ్రవరి 10న విడుదల కానుంది. ఇది టాలీవుడ్ బ్లాక్ బస్టర్ అలవైకుంఠపురములో చిత్రానికి రీమేక్. కృతి సనోన్ హిందీలో కథానాయిక. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. కార్తీక్ ప్రస్తుతం బాక్సాఫీస్ కింగ్ గా వెలిగిపోతున్నాడు. భూల్ భులయా 2తో బ్లాక్ బస్టర్ కొట్టి ఫ్రెడ్డీతోను మెప్పించాడు. అందుకే ఇదే వరుసలో `షెహజాదా` హిట్ అవుతుందని భావిస్తున్నారు.
రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ.. 2023 ప్రథమార్థంలో భారీ అంచనాలతో విడుదల కానుంది. ఈ చిత్రంతో గల్లీ బోయ్ జంట అలియా భట్ -రణవీర్ సింగ్ తిరిగి కలిసి నటిస్తున్నారు. రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీతో రెండవసారి మ్యాజిక్ చేస్తారని అభిమానులు భావిస్తున్నారు. ఈ చిత్రం 28 ఏప్రిల్ 2023న విడుదలవుతుంది. గల్లీబోయ్ లా కమర్షియల్ హిట్ సాధించి మంచి వసూళ్లు వస్తాయని ఆశిస్తున్నారు.
పఠాన్ జనవరిలో విడుదలవుతుండగా ఐదు నెలల గ్యాప్ తో మరోసారి కింగ్ ఖాన్ తన అభిమానులను అలరించేందుకు పక్కా ప్రణాళికతో వస్తున్నాడు. షారుఖ్ ఖాన్ - అట్లీ కాంబినేషన్ మూవీ `జవాన్` 2 జూన్ 2023న విడుదల కానుంది. ఒకే సంవత్సరంలో SRK రెండు రిలీజ్ లతో దూకుడును ప్రదర్శించనున్నాడు. ఈ చిత్రంపైనా అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి.
టైగర్ 3 తో కొత్త సంవత్సరంలో భాయ్ దూసుకొస్తున్నాడు. సల్మాన్ ఖాన్- కత్రినా కైఫ్ జంటగా నటించిన ఈ చిత్రం అత్యంత భారీగా విడుదల కానుంది. విజయవంతమైన ఫ్రాంఛైజీలో సల్మాన్- కత్రిన కెమిస్ట్రీ అభిమానులకు గొప్పగా కనెక్టయింది. కత్రిన విక్కీని పెళ్లాడాక తిరిగి సల్మాన్ తో నటిస్తుండడంతో మరింత ఆసక్తి నెలకొంది.
ప్రథమార్థంలో షారూక్ ఖాన్- రణవీర్ సింగ్- కార్తీక్ ఆర్యన్ లాంటి టాప్ హీరోల సినిమాలు భారీగా రిలీజవుతుండగా.. ఇంతమందితో పోటీపడుతూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వార్ లోకి దూసుకొస్తున్నాడు. అతడు నటించిన ఆదిపురుష్ 3డి తెలుగు-తమిళంతో పాటు హిందీలోను సంచలనాలు సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. ఆదిపురుష్ తొలి టీజర్ పై విమర్శలు వెల్లువెత్తినా ఓంరౌత్ ఇందులో లోటు పాట్లను సరిదిద్దే పనిలో పడటం కొంత ఊరటనిస్తోంది. కొన్ని వివాదాలకు పరిష్కారం కనుగొంటూనే వీ.ఎఫ్.ఎక్స్ పని తనంలో క్వాలిటీ కోసం ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ప్రభాస్ వర్సెస్ సైఫ్ అలీఖాన్ వార్ (చెడుపై మంచి సాధించే విజయం) నేపథ్యంలోని కథాంశం కావడంతో అందరినీ ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు. రామాయణం స్ఫూర్తితో శ్రీరాముని కథతో ఈ మూవీ రూపొందుతోంది. శ్రీరాముడిగా ప్రభాస్ .. రావణుడిగా సైఫ్ ఖాన్ నటిస్తుండగా సీతగా కృతి సనోన్ నటిస్తోంది. ప్రభాస్ కి ఉత్తరాది బెల్ట్ లో ఉన్న క్రేజ్ దృష్ట్యా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుందనే అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం సౌత్ సినిమాల చుట్టూ సక్సెస్ అనే `ఆరా` (AURA సౌరభం) పని చేస్తోంది. ఇది ఆదిపురుష్ 3డికి బాగా కలిసొస్తుందనే ఆశిస్తున్నారు. 2023 ప్రథమార్థంలో కేవలం ప్రభాస్ సినిమా మాత్రమే కాదు.. ఈసారి పలువురు తెలుగు అగ్ర హీరోల సినిమాలు కూడా హిందీలో భారీ రిలీజ్ లకు ప్రణాళికలతో రెడీ అవుతున్నాయని సమాచారం. పలువురు యువహీరోలు కూడా హిందీ మార్కెట్ పై కన్నేయడంతో ప్రతిదీ చర్చనీయాంశంగా మారుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.