Begin typing your search above and press return to search.

'వెయిట్'కు తగ్గ ఫలితం.. అక్కినేని హీరో అందుకుంటాడా??

By:  Tupaki Desk   |   12 Jun 2021 1:30 PM GMT
వెయిట్కు తగ్గ ఫలితం.. అక్కినేని హీరో అందుకుంటాడా??
X
అక్కినేని యువహీరో అఖిల్.. ప్రస్తుతం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ రూపొందిస్తున్నాడు. అయితే కెరీర్ పరంగా పరుగు మూవీ తర్వాత మరో హిట్ అందుకోలేదు డైరెక్టర్ భాస్కర్. అలాగే హీరో అఖిల్ ఇప్పటికి కెరీర్ ఫస్ట్ హిట్టు కోసమే వెయిట్ చేస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పై ఇద్దరూ భారీ ఆశలే పెట్టుకున్నారు. కానీ ఈ మూవీకి మొదటి నుండి ఏదోకటి ప్రాబ్లెమ్ ఎదురవుతూనే ఉంది. నిజానికి గతేడాది ఏప్రిల్ నెలలో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. లాక్డౌన్ కారణంగా ఈ ఏడాది సంక్రాంతికి వాయిదాపడింది.

తీరా సంక్రాంతికి రిలీజ్ అనేసరికి మరో ప్రాబ్లెమ్.. అదే రీషూట్. డైరెక్టర్ భాస్కర్ టీమ్ మళ్లీ బ్యాచిలర్ మూవీ సెకండ్ హాఫ్ స్టోరీలో మార్పులు చేసి కొత్తగా స్క్రిప్ట్ రాసి రీషూట్ చేశారు. అయితే బ్యాచిలర్ విషయంలో అఖిల్ హ్యాపీగానే ఉన్నట్లు పలు కథనాలు చెబుతున్నాయి. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌ పై బ‌న్నీ వాసు, వాసువ‌ర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ వేయడంతో మిగిలిన కాస్త షూటింగ్ కూడా నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా కంప్లీట్ చేయడానికి ఆ చిన్న షెడ్యూల్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అందులోను ఇటీవలే గీతాఆర్ట్స్ వారు ఈ సినిమాను ఖచ్చితంగా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు తేల్చిచెప్పేసారు.

ప్రస్తుతం ఈ సినిమా రోజురోజుకి మరింత ఆలస్యం అవుతుండటంతో ప్రేక్షకులలో కూడా సినిమా పై ఆసక్తిపోయే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. ఈ పాయింట్ మేకర్స్ చెవిలో పడి తాజాగా మరోసారి థియేట్రికల్ రిలీజ్ లేదా ఓటిటి రిలీజ్ అనే ఆలోచన మొదలు పెట్టినట్లు టాలీవుడ్ లో కథనాలు వినిపిస్తున్నాయి. కానీ ఏ హీరోకైనా తన సినిమా థియేటర్ లో హిట్ అయితేనే ఆ ఫీల్ వేరుంటుంది. సో ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే బ్యాచిలర్ బాబు ఇప్పట్లో వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. అసలే థియేటర్స్ అంతంత మూసి ఉన్నాయి. ఒకవేళ ఓపెన్ అయినా ఫస్ట్ 50% సీటింగ్ తో నడుస్తాయి. మరి సినిమానెమో మేకర్స్ ఎప్పుడు థియేటర్స్ ఓపెన్ అయితే అప్పుడే అని కాచుకొని ఉన్నారు. చూడాలి మరి ఇంతకాలం వెయిట్ చేసినందుకు ఫలితం పాజిటివ్ గా వస్తుందేమో!