Begin typing your search above and press return to search.
అమ్మడి నెగిటివిటీ ఎఫెక్ట్ 'ఆర్.ఆర్.ఆర్' పై పడనుందా...?
By: Tupaki Desk | 13 Aug 2020 10:10 AM GMTఅలియా భట్.. డైరెక్టర్ మహేష్ భట్ వారసత్వంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టి అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకుంది. ‘హైవే’ ‘2 స్టేట్స్’ ‘డీయర్ జిందగీ’ ‘రాజీ’ ‘కలంక్’ ‘గల్లీ బాయ్’ సినిమాలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడే అదే స్థాయిలో ఆమె చుట్టూ నెగిటివిటీ కూడా వచ్చి చేరింది. సుశాంత్ సింగ్ మరణం తర్వాత విమర్శలు ఎదుర్కుంటున్న మహేష్ భట్ మరియు అతని తనయ అలియాల సినిమాలపై నెపోటిజం ఎఫెక్ట్ బాగా పడింది. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో సన్నిహితంగా ఉండే మహేష్ భట్ కూడా అతని మరణానికి కారకుడని.. అలియా భట్ పలు సందర్భాల్లో సుశాంత్ ని చిన్నచూపు చూసిందని సోషల్ మీడియా వేదికగా వీరిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు లేటెస్టుగా విడుదలైన 'సడక్ 2' ట్రైలర్ పై దాని ప్రభావం కనబడింది. ఈ ట్రైలర్ కి వచ్చిన డిస్ లైక్స్ చూస్తే వారిపై ఏ రేంజ్ లో నెగిటివిటీ ఉందో అర్థం అవుతుంది.
ఇదిలా ఉండగా మరోవైపు ఆలియా భట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పైనా దీని ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సుశాంత్ కేసు ఒక కొలిక్కి వచ్చే దాకా నెపోటిజం పై జరుగుతున్న రచ్చకు ఫుల్ స్టాప్ పడే అవకాశాలు లేవు. దీంతో అలియా తో ఒప్పందాలు కుదుర్చుకున్న దర్శకనిర్మాతలు ఇప్పుడు డైలమాలో పడ్డారని తెలుస్తోంది. ఇక అలియా సెగ టాలీవుడ్ కూ గట్టిగానే తాకేట్టు కనిపిస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ 'ఆర్.ఆర్.ఆర్' లో అలియా భట్ నటించబోతున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి బాలీవుడ్ లో హైప్ తీసుకొచ్చేందుకు అలియాను ఎందుకున్నారు మేకర్స్. అయితే ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అమ్మడు 'ఆర్.ఆర్.ఆర్' కి ప్లస్ అవుతుందే మాట పక్కనపెట్టి ఆమె ఈ సినిమాకి నెగిటివ్ అవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినీ జనాల్లో సుశాంత్ పై ఉన్న సింపతీ అలియాపై నెగిటివిటీగా మారింది. ఇది 'ఆర్.ఆర్.ఆర్'పై కూడా ఎఫెక్ట్ చూపించొచ్చు. రాజమౌళి - ఎన్టీఆర్ - చరణ్ క్రేజ్ తో సౌత్ లో ఈ సినిమా ప్రభావాన్ని చూపినా.. అలియా వల్ల నార్త్ లో నెగిటివ్ ఎఫెక్ట్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'ఆర్.ఆర్.ఆర్' మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.