Begin typing your search above and press return to search.
అఖిల్ 4 కి అంతా క్లియరేనా ?
By: Tupaki Desk | 5 July 2019 6:49 AM GMTఅక్కినేని లాంటి స్టార్ ఫామిలీ నుంచి వచ్చిన హీరోగా మూడేళ్ళ కెరీర్ పూర్తి చేసుకున్నా అఖిల్ కు ఒక్క హిట్టు లేకపోవడం అభిమానులను కలవరపరిచే విషయమే. ఎంత జాగ్రత్తగా కథలను ఎంచుకున్నా ఫామ్ లో ఉన్న దర్శకులను తీసుకున్నా ఫలితం మాత్రం మారడం లేదు. అందుకే ప్రతి ప్రాజెక్ట్ కు మధ్యలో గ్యాప్ ఎక్కువగా వస్తోంది. ఇప్పుడు నాలుగోది గీత బ్యానర్ నిర్మాణంలో చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ అయితే చేశారు కానీ రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. హీరోయిన్ ఫైనల్ కావడంలో జరుగుతున్న జాప్యం కారణంగా కొద్దిగా పెండింగ్ పెట్టారనే టాక్ ఉంది.
మరోవైపు ఇప్పటిదాకా జరిగిన స్క్రిప్ట్ వర్క్ మీద గీత సంస్థ పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేయలేదనే గాసిప్ కూడా లీకైపోయింది. వీటి నిర్ధారణ ఎలా ఉన్నా బొమ్మరిల్లు తరువాత అసలు సక్సెస్ చూడని దర్శకుడు భాస్కర్ దీంతో అఖిల్ కు మాత్రమే కాదు తనకు తాను లైఫ్ ఇచ్చుకునే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయితేనే అవకాశాల కోసం ఎదురు చూడొచ్చు. బయట హీరోలతో తక్కువగా సినిమాలు చేసే గీతతో నాగ చైతన్య గతంలో 100 పర్సెంట్ లవ్ తో హిట్టు కొట్టాడు.
ఇప్పుడు అఖిల్ కి అదే జరుగుతుందన్న నమ్మకం అభిమానుల్లో ఉంది. హిట్ దర్శకులు ఫ్లాపులు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఫ్లాప్ దర్శకుడు హిట్ ఇస్తాడేమో. ఏమో పరిశ్రమలో ఇలాంటివి జరగడం సహజమే కాబట్టి భాస్కర్ ని నమ్మి ఇంత పెద్ద బాధ్యత ఇచ్చారు అంటే కథlలో విషయం లేకుండానే ఒప్పుకుంటారు అనుకోలేం కదా. ఈ లెక్కన అఖిల్ 4 ఈ ఏడాది విడుదల కావడం కొంత డౌట్ గానే ఉంది.