Begin typing your search above and press return to search.

నిజంగా మెగా రామాయణం ఉంటుందా ?

By:  Tupaki Desk   |   1 Aug 2019 1:30 AM GMT
నిజంగా మెగా రామాయణం ఉంటుందా ?
X
కొద్దిరోజుల క్రితం అల్లు అరవింద్ మరికొందరు పార్టనర్స్ తో కలిసి సుమారు 1500 కోట్ల బడ్జెట్ తో రామాయణం తీస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. న్యూస్ అయితే వచ్చింది కానీ దాని తర్వాత ఎలాంటి కదలిక గీతా కాంపౌండ్ లో కనిపించడం లేదు. నిజంగా అంత బడ్జెట్ పెట్టి తీస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ బ్యానర్ లో రూపొందుతున్న ఇతర సినిమాల చర్చలు షూటింగులు నిర్విరామంగా జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు డిజిటల్ ఎంటర్ టైన్మెంట్ వైపు పెట్టుబడులు పెట్టేందుకు సైతం గీతా సంస్థ రెడీ అవుతోంది.

ఈ నేపథ్యంలో అంత భారీ కాన్వాస్ తో అనుకున్న రామాయణం నిజంగా పట్టాలు ఎక్కుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఊరికే హడావిడిగా ప్రకటనలు ఇచ్చేసి తర్వాత క్యాస్టింగ్ కుదరలేదనో ఇతర ప్రొడ్యూసర్లు తప్పుకున్నారనో చెప్తారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇలాగే మోహన్ లాల్ భీముడిగా కేరళ వ్యాపారవేత్త ఒకరు వెయ్యి కోట్లతో మల్టీ లాంగ్వేజ్ మహాభారతం తీస్తానని ప్రకటించారు. దీంట్లో నాగార్జున లాంటి స్టార్లు కూడా ఉంటారని న్యూస్ వచ్చింది. ఓ ఏడాది అయ్యాక తూచ్ అనేసి ఆయన దాన్ని క్యాన్సిల్ చేశారు.

ఇప్పుడు అల్లు వారి రామాయణం అలా కాకూడదనే అభిమానుల కోరిక. ఇప్పటికే కొన్ని వందల వేల సార్లు వివిధ రూపాల్లో జనం చూసేసిన రామాయణాన్ని మళ్ళీ అంత ఖర్చు పెట్టి త్రిడిలో తీస్తే వర్క్ అవుట్ అవుతుందా అనే అనుమానాలు లేకపోలేదు కానీ ఎవరు ఇందులో నటిస్తారు అనేదాన్ని బట్టి హైప్ రావడం ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించిన క్లారిటీ ఇప్పట్లో వచ్చేలా లేదు కానీ ఇంకొంత కాలం వెయిట్ చేయక తప్పదు