Begin typing your search above and press return to search.

అల్లూరికి 'అల్లు' బ్రాండ్ కలిసొస్తుందా..?

By:  Tupaki Desk   |   19 Sep 2022 4:55 PM GMT
అల్లూరికి అల్లు బ్రాండ్ కలిసొస్తుందా..?
X
కెరీర్ ప్రారంభంలో చిన్న రోల్స్ చేసిన శ్రీవిష్ణు.. ఇప్పుడు హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. విభిన్నమైన చిత్రాలు - విలక్షణమైన పాత్రలతో వర్సటైల్ యాక్టర్ అనిపించుకున్నాడు. వరుస సినిమాలతో ఏడాది పొడవునా బిజీగా ఉండే శ్రీ విష్ణు.. ఇప్పుడు ''అల్లూరి'' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

'అల్లూరి' చిత్రానికి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించారు. 'నిజాయితీకి మారు పేరు' అనేది దీనికి ఉపశీర్షిక. ఇందులో శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ కంటెంట్ ఆధారిత సినిమాపై బజ్ క్రియేట్ అయింది.

ఒక పోలీసు అధికారి తన విప్లవాత్మక ఆలోచనలతో మొత్తం డిపార్ట్మెంట్ లో ఎలాంటి మార్పును తీసుకువస్తాడనే పాయింట్ తో.. ఎల్లవేళలా డ్యూటీకి ప్రాధాన్యత ఇచ్చే నిజాయితీ గల పోలీసులకు నివాళిగా ''అల్లూరి'' చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

ఇటీవల కాలంలో శ్రీవిష్ణు సినిమాలను చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు పెద్దగా రావడం లేదనే కామెంట్స్ వస్తున్నాయి. కాకపోతే అతని సినిమాలు ఓటీటీ మరియు టీవీలలో సక్సెస్ అవుతున్నాయి. అందుకే టాలెంటెడ్ హీరో థియేట్రికల్ రైట్స్ దిగడం లేదని తెలుస్తోంది.

'రాజ రాజ చోర' వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత వచ్చిన 'అర్జున ఫల్గుణ' & 'భళా తందనాన' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయ్యాయి. దీంతో ఇప్పుడు ''అల్లూరి'' సినిమాపైనే శ్రీవిష్ణు ఆశలు పెట్టుకున్నాడు. అందుకే ఇంతకుముందు లేనంతగా తన సినిమాకు ప్రమోషన్స్ చేస్తున్నాడు. దీని కోసం ఇండస్ట్రీలో తనకున్న సన్నిహితుల సహాయం కూడా తీసుకుంటున్నాడు.

ఇటీవల ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు నేచురల్ స్టార్ నాని హాజరై శ్రీ విష్ణు కు తన బెస్ట్ విషెస్ అందజేశారు. అలానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'అల్లూరి' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది శ్రీ విష్ణు సినిమా చుట్టూ సందడి ఏర్పడేలా చేస్తుందని చెప్పాలి.

అల్లు అర్జున్ బ్రాండ్ కచ్చితంగా 'అల్లూరి' ఫస్ట్ డే ఫస్ట్ షోలకి పుల్లర్ కావొచ్చు. బన్నీ లాంటి పాన్ ఇండియా స్టార్ ప్రమోషన్స్ లో భాగం అవ్వడం వలన.. అది చిన్న సినిమా అయినా సరే జనాల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తుంది.. వారిని థియేటర్ల వరకూ రప్పిస్తుంది. మౌత్ టాక్ కూడా బాగా ఉంటే.. బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా నిలబడే ఛాన్స్ ఉంటుంది.

చిన్న సినిమానా పెద్ద సినిమా అని కాకుండా కంటెంట్ బాగుంటే ఏదైనా ఆడుతుందని.. మంచి సినిమా అయితే చాలు.. ప్రజలు ఆదరిస్తున్నారని ఇటీవల కాలంలో కొన్ని చిత్రాలు నిరూపించాయి. ఇప్పుడు 'అల్లూరి' కూడా అదే కోవకు చెందిన సినిమా అయితే మాత్రం.. ప్రేక్షకులు థియేటర్లకు తరలి వచ్చే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.