Begin typing your search above and press return to search.

అను గ్లామ‌ర్ షో అల్లూ వార‌బ్బాయిని గ‌ట్టెక్కిస్తుందా?

By:  Tupaki Desk   |   4 Nov 2022 2:30 AM GMT
అను గ్లామ‌ర్ షో అల్లూ వార‌బ్బాయిని గ‌ట్టెక్కిస్తుందా?
X
అల్లూ వార‌బ్బాయి అల్లు శిరీష్ దాదాపు మూడున్న‌రేళ్ల విరామం త‌రువాత న‌టించిన రొమాంటిక్ ల‌వ్ స్టోరీ 'ఊర్వ‌శీవోఎ రాక్ష‌సివో'. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రాకేష్ శ‌శి తెర‌కెక్కించాడు. గ‌త కొంత కాలంగా స‌రైన హిట్టు లేక హీరోయిన్ గా రేసులో వోన‌క‌బ‌డి వున్న అను ఇమ్మాన్యుయేల్ ఇందులో హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా ముగ్గురి కెరీర్ కి అత్యంత కీల‌కంగా మారింది. హీరో అల్లు శిరీష్‌, హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్, ద‌ర్శ‌కుడు రాకేష్ శ‌శి ల‌కు ఈ మూవీ హిట్ అత్యంత కీల‌కంగా మారింది.

త‌మిళంలో హ‌రీష్ క‌ల్యాణ్, రైజా విల్స‌న్ జంట‌గా న‌టించిన రొమాంటిక్ కామెడీ 'ప్యార్ ప్రేమ కాదల్‌' మూవీ ఆధారంగా ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేశారు. 'ప్యార్ ప్రేమ కాదల్‌' మూవీకి రైజా విల్స‌న్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచి సినిమా స‌క్సెస్ కు ప్ర‌ధాన కార‌ణంగా మారింది. తెలుగులోనూ అదే ఫీట్ రిపీట్ అవుతుంద‌ని అంటున్నారు. గ‌త కొంత కాలంగా స‌రైన హిట్ లేక రేసులో వెన‌క‌బ‌డిన హీరో అల్లు శిరీష్‌.

దాదాపు మూడున్న‌రేళ్ల విరామం త‌రువాత ఈ మూవీలో న‌టించాడు. ఈ సారి ఎలాగైనా హిట్ ని త‌న ఖాతాలో వేసుకుని మ‌ళ్ల ట్రాక్ లోకి రావాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే యూత్ ని టార్గెట్ గా ఈ మూవీని శిరీష్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా ఈ మూవీ స‌క్సెస్ కోసం అను గ్లామ‌ర్ షో పైనే భారం మొత్తం వేసిన‌ట్టుగా తెలుస్తోంది.

ఈ మూవీ టీజ‌ర్ లో అనుతో క‌లిసి శిరీష్ రెచ్చిపోయి లిప్ లాక్ ల‌కు దిగిన తీరు, ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే బెడ్ సీన్స్ సినిమాలో వుండే 16 లిప్ లాక్ స‌న్నివేశాలు యూత్ ఎట్రాక్ట్ చేయ‌నున్నాయ‌ని తెలుస్తోంది. ఈ సినిమా విష‌యంలో శిరీష్ కంప్లీట్ గా అను ఇమ్మాన్యుయేల్ గ్లామ‌ర్ షో పైనే అత్య‌ధికంగా ఆధార‌ప‌డిన‌ట్టుగా తెలుస్తోంది. గ‌త కొంత కాలంగా వ‌రుస ఫ్లాపుల‌తో ఐర‌న్ లెగ్ ముద్ర వేసుకున్న అను ఈ మూవీతో ఆ ముద్ర‌ని చెరిపేసుకోవాల‌నే ఆలోచ‌నలో వుంది.

అందుకే ఇంత వ‌ర‌కు ఏ సినిమాలో న‌టించ‌ని విధంగా అల్లు శిరీష్ తో క‌లిసి హాట్ హాట్ స‌న్నివేశాల్లో న‌టించ‌డ‌మే కాకుండా హీటెక్కించే రొమాంటిక్ సీన్ ల‌లోనూ ఎలాంటి బెరుకు లేకుండా న‌టించింద‌ని టీజ‌ర్ ,ట్రైల‌ర్ తో క్లారిటీ ఇచ్చేసింది. అను గ్లామ‌ర్ షో కార‌ణంగానే ఈ మూవీకి యూత్ లో ఎంతో కొంత బ‌జ్ క్రియేట్ అయింది.

త‌న గ్లామర్ షోలో ఈ మూవీకి ఓపెనింగ్స్ ని రాబ‌ట్ట‌నుంద‌ని తెలుస్తోంది. అయితే ఎంత గ్లామ‌ర్ షోపై ఆధార‌ప‌డినా కంటెంట్ లేక‌పోతే ఆడియ‌న్స్ వెంట‌నే తిర‌స్క‌రిస్తున్నారు. మ‌రి ఆవిష‌యంలో ద‌ర్శ‌కుడు రాకేష్ శ‌శి ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేయ‌గ‌లిగితే అను శ్ర‌మ‌కు త‌గ్గ ఫ‌లితం వుండే అవ‌కాశం వుంద‌ని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.