Begin typing your search above and press return to search.
అమలాపాల్ బాలీవుడ్ ఎంట్రీ పనవుతుందా?
By: Tupaki Desk | 4 Nov 2022 10:30 AM GMTమాతృభాష మాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అటుపై టాలీవుడ్..కోలీవుడ్ ని చుట్టేసి తిరిగి మళ్లీ సొంత భాషకే పరిమితమైంది అమలపాల్. ఇక్కడ అమ్మడి కోలీవుడ్ జర్నీ ఎంతో ఆసక్తికరం. టాలీవుడ్ లో వెంట వెంటనే స్టార్ హీరోలతో ఛాన్సులు అందుకున్నా సక్సెస్ లపరంగా వెనుకబడటంతో అటుపై అవకాశాలు కరువయ్యాయి.
ఈపథ్యంలోనే కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ కొంత వరకూ రాణించే ప్రయత్నం చేసింది. సరిగ్గా కె రీర్ పీక్స్ కి చేరుకుంటోన్న సమయంలో దర్శకుడు. ఏ.ఎల్ విజయ్ ని వివాహం చేసుకోవడం..అంతే వేగంగా విడిపోవడం వంటివి వెంట వెంటనే జరిగిపోయాయి. ఈ ఘటన అమల కెరీర్ ని ఒక్కసారిగా మలుపు తిప్పింది. విడాకుల మచ్చ కొంత వరకూ ప్రభావం చూపింది.
అయినా అమల ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అవకాశాలు చేజిక్కుకుంచుంది. కానీ మునుపటి అంత వేగాన్ని మాత్రం అందుకోలేకపోయింది. దీంతో కొంత కాలంగా మలయాళం లోనే సినిమాలు చేస్తోంది. తాజాగా అమ్మడి బాలీవుడ్ ఎంట్రీ కూడా కన్పమ్ అయింది. ఏకంగా తొలి ఛాన్స్ అజయ్ దవేగణ్ సరసన అందుకుంది. ఆయన హీరోగా ...దర్శకత్వలో తెరకెక్కుతోన్న 'బోలా' అమలని హీరోయిన్ గా తీసుకున్నారు.
'ఖైదీ' సినిమాకి రీమేక్ రూపం ఇది. బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం అమలని ఏరికోరి మరీ ఎంపిక చేసారుట. అజయ్ రాసుకున్న పాత్రకి అమె అయితేనే న్యాయం చేస్తుందని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే తెలుగు..తమిళ్ లో ఔడెట్ గా తేలిన అమలాపాల్ నటించడం పై వర్కౌట్ అవుతుందా? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి.
పైగా ఇది హిందీ డుబ్యూ మూవీ కావడంతో అజయ్ ఆలోచన ఏమై ఉంటుంది? అన్న కోణంలో వార్తలొస్తున్నాయి. పాన్ ఇండియాలో ఫేమస్ అయిన రెండు భాషల్లో రాణించలేని అమ్మడు బాలీవుడ్ లో ఎంత వరకూ నెట్టుకొస్తుందంటూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ విషయంలో అమలాపాల్ ఎలాంటి స్ర్టాటజీతో ముందుకెళ్తుందో చూడాలి.
సినిమా హిట్ అయితే గనుక అవకాశాలు క్యూ కట్డడం ఖాయం. కంటెట్ బేస్డ్ చిత్రాలకు ఆదరణ పెరుగుతోన్న నేపథ్యంలో అమలా పాల్ ఆ రకమైన కథలతో ముందుకెళ్లిన సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మరి హిందీలో ఆడియన్స్ ని అమల ఎలా మురిపిస్తుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.