Begin typing your search above and press return to search.
ప్రముఖ ఓటీటీ సరికొత్త స్ట్రాటజీ వర్కౌట్ అయ్యేనా..?
By: Tupaki Desk | 8 Nov 2022 11:30 PM GMTకరోనా పాండమిక్ టైంలో మనదేశంలో ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ బాగా అభివృద్ధి చెందాయి. ఇంటికే పరిమితమైన జనాలకు వినోదాన్ని అందించే ప్రత్యామ్నాయ మార్గాలుగా మారడంతో.. తక్కువ కాలంలోనే విశేష ఆదరణ పొందాయి. ఈ క్రమంలో ఓటీటీల మధ్య కూడా పోటీ ఎక్కువైంది.
ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ ను అందిస్తూ వీక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసాయి. డైరెక్ట్ ఓటీటీ రిలీజులతో పాటుగా సరికొత్త సినిమాలు - వెబ్ సిరీస్ లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ విధంగా సబ్ స్క్రైబర్స్ ని పెంచుకుంటూ వచ్చాయి.
అయితే థియేటర్లు ఓపెన్ అయి ఎప్పటిలాగే సినిమాలు రిలీజ్ చేయడం ప్రారంభించిన తర్వాత ఓటీటీల హవా కాస్త తగ్గు ముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఎర్లీ స్ట్రీమింగ్ అనే కొత్త స్ట్రాటజీకి తెర లేపాయి. అంతేకాదు సరసమైన ధరలకు సబ్ స్క్రిప్షన్ ను అందించడం ప్రారంభించాయి.
పాండమిక్ తర్వాత ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకోడానికి మొబైల్-ఓన్లీ అనే సరికొత్త ఎత్తుగడతో వచ్చింది. నెలకు కేవలం రూ. 149 చెల్లించే విధంగా ప్లాన్ ని ప్రవేశపెట్టింది. ఇది ఒక మొబైల్ స్క్రీన్ కు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ అతి తక్కువ ధరలో అందించే ప్లాన్ ఇదేనని చెప్పాలి.
ఇప్పుడు భారతదేశ ఓటీటీ రంగంలో ఎక్కువ వాటా కలిగి ఉన్న ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా నెట్ ఫ్లిక్స్ బాటలో ఎకనామిక్ ప్లాన్ ని రూపొందించింది. భారతీయ మార్కెట్ కోసం ప్రేక్షకులను మరింతగా ఆకర్షించటానికి ఏడాదికి రూ. 599 సబ్ స్కిప్షన్ చార్జెస్ తో కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది.
రూ. 599 అనేది మొబైల్-ఓన్లీ ప్లాన్. ఒక్క మొబైల్ డివైజ్ కు మాత్రమేపరిమితం అవుతుంది. అంతేకాదు ఇది కేవలం అమెజాన్ ప్రైమ్ వీడియోకు మాత్రమే సభ్యత్వం కల్పిస్తుంది కానీ.. అన్ని ప్రైమ్ సేవలకు కాదు. అంటే ఈ ప్లాన్ అమెజాన్ ఇ-కామర్స్ సైట్ లో ప్రైమ్ షాపింగ్ మరియు ఫ్రీ డెలివరీ సేవలను అందించదు.
ప్రైమ్ వీడియో మిగతా సబ్‌స్క్రిప్షన్ లేదా ఇ-కామర్స్ సేవలతో పాటుగా అమెజాన్ ప్రైమ్ యొక్క అని సేవలను వినియోగించుకోవచ్చు. అదే ఇప్పుడు రూ. 599 మొబైల్-ఓన్లీ నెల ప్లాన్ లో అవన్నీ తగ్గించబబడ్డాయి. అందుకే ఈ ప్లాన్ అమెజాన్ కు ఏ మేరకు వర్కౌట్ అవుతుందో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
డిస్నీ+హాట్ స్టార్ ఓటీటీ ఏడాదికి రూ. 499 తో మొబైల్ ఓన్లీ ప్లాన్ ని అందిస్తోంది. అలానే జీ5 ఓటీటీ 699 రూపాయలకే ఏడాది సబ్ స్క్రిప్షన్ అందిస్తోంది. అయితే ఈ ప్లాన్ ఒకేసారి మూడు డివైజ్ లలో కంటెంట్ చూడటానికి అవకాశం కల్పిస్తుంది. తెలుగు ఓటీటీ ఆహా రూ.399 లకే ఏడాది సాధారణ సబ్ స్క్రిప్షన్ ఇస్తోంది.
ఇవన్నీ కూడా సరసమైన ధరలకే మొబైల్ ఓన్లీ ప్లాన్లను అందిస్తున్నాయి. మిగతా వాటితో పోల్చుకుంటే నెట్ ఫ్లిక్స్ చందా కాస్త ఎక్కువైనా.. కంటెంట్ చాలా వైవిధ్యంగా ఆకర్షణీయంగా ఉంటుందని రూ.149 ప్లాన్ పట్ల అందరూ ఆకర్షితులవుతున్నారు. ఇ-కామర్స్ సేవలు లేకపోయినా క్వాలిటీ బాగుంటుందని సబ్‌స్క్రిప్షన్ తీసుకోడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
కానీ నెట్ ఫ్లిక్స్ తో పోలిస్తే అమెజాన్ ప్రైమ్ వీడియో లైబ్రరీ వైవిధ్యంగా ఉండదని.. కంటెంట్ క్వాలిటీని సరిపోల్చలేమనే టాక్ ఉంది. అందుకే ఇప్పుడు రూ. 599 మొబైల్ ఓన్లీ ప్లాన్ కి ఏమాత్రం ఆకర్షితులవుతారో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అదే ప్లాన్ లో అమెజాన్ ఇ-కామర్స్ సేవలు కూడా అందుబాటులో ఉంచితే ప్లాన్ వర్కౌట్ అవ్వొచ్చని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.