Begin typing your search above and press return to search.
పార్ట్-2 లో అయినా ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉంటుందా..?
By: Tupaki Desk | 23 Dec 2021 5:00 PM ISTబుల్లితెరపై యాంకర్ గా రాణిస్తున్న అనసూయ భరద్వాజ్.. 'క్షణం' 'సోగ్గాడే చిన్నినాయనా' 'రంగస్థలం' వంటి చిత్రాలతో వెండితెరపై అలరించింది. ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' సినిమాలో చేసిన రంగమ్మత్త పాత్ర అనసూయకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో సుక్కూ డైరెక్ట్ చేసిన ''పుష్ప'' సినిమాలో కూడా ఆమెకు అవకాశం ఇచ్చారు.
అల్లు అర్జున్ హీరోగా రూపొందిన 'పుష్ప: ది రైజ్' చిత్రంలో దాక్షాయణి అనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అనసూయ నటించింది. విలన్ పాత్ర పోషించిన సునీల్ భార్యగా.. డిఫరెంట్ లుక్ లో కనిపించింది. చిత్తూరు యాసలో డైలాగ్స్ చెప్పి ఆకట్టుకుంది. ఒంటి నిండా నగలు.. నుదుటిన పెద్ద బొట్టుతో ఆమెను సుక్కూ కొత్తగా ప్రెజెంట్ చేశారు. కాకపోతే సినిమాలో అనసూయ పాత్ర తేలిపోయిందనే కామెంట్స్ వచ్చాయి.
అనసూయ ఫస్ట్ లుక్ విడుదలప్పుడు దాక్షయణి భయంకరమైనది.. ఎవరికీ భయపడదని.. అంతకు మించి అహంకారి అని.. పొగరుబోతు అని చిత్ర బృందం పేర్కొంది. తీరా సినిమా చూస్తే అనసూయ పాత్రను ఎలివేట్ చేసే ఒక్కటంటే ఒక్క సరైన సీన్ కూడా పడలేదు. ఎక్కువ స్క్రీన్ టైమ్ కూడా లభించకపోవడంతో చాలా మందిని నిరాశపరిచింది.
అయితే 'పుష్ప' పార్ట్-1 లో అనసూయ పాత్రకు ముగింపు పలకలేదు కాబట్టి.. రెండో భాగంలోనూ కొనసాగుతుందని అర్థం అవుతోంది. తన తమ్ముణ్ణి చంపిన పుష్పరాజ్ మీద ప్రతీకారం తీర్చుకోడానికి ట్రై చేసే విధంగా ఆమె పాత్ర ఉండబోతోంది. 'పుష్ప: ది రూల్' లో అయినా ఆమెకు మరింత స్క్రీన్ స్పేస్ దొరుకుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
'పుష్ప' కథంతా సెకండ్ పార్ట్ లోనే ఉంటుందని దర్శకుడు సుకుమార్ చెబుతున్నారు. మొదటి భాగంలో కేవలం పాత్రలను మాత్రమే పరిచయం చేశానని.. పార్ట్-2 నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని తెలిపారు. దీంతో అనసూయ పాత్రను సుక్కూ ఎంత పవర్ ఫుల్ గా చూపిస్తారో.. వదినా అని పిలిచే పుష్పరాజ్ కి ఆమెకు మధ్య సీన్స్ ఎలా డిజైన్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. గతంలో 'క్షణం' సినిమాలో అనసూయ విలనీ పండించింది. ఇప్పుడు 'పుష్ప: ది రూల్' గ్లామరస్ యాంకర్ కు ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.