Begin typing your search above and press return to search.
'ఆగడు' ఫ్లాప్ కు బదులు తీర్చుకునే సమయం
By: Tupaki Desk | 11 Dec 2019 9:48 AM GMTమహేష్ బాబు కెరీర్ లో 'ఆగడు' సినిమా ఫ్లాప్ గా మిగిలి పోయింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం చాలా అంచనాల నడుమ విడుదలై నిరాశ పర్చింది. ఆగడు సినిమా స్క్రిప్ట్ వర్క్ లో అనీల్ రావిపూడి భాగస్వామ్యం అయ్యాడు. అయితే స్క్రిప్ట్ ఫస్ట్ హాఫ్ వరకే అనీల్ రావిపూడి వర్క్ చేశాడు. ఆ తర్వాత పటాస్ ఛాన్స్ రావడంతో సెకండ్ హాఫ్ పూర్తి చేయకుండానే మద్యలో వదిలేశాడు. మద్యలో వదిలేశావు కదా అంటూ శ్రీనువైట్ల అనేవాడంటూ అనీల్ చెప్పుకొచ్చాడు. ఆగడు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే రాసి ఉంటే వేరే విధంగా రాసేవాడిని. ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ప్లాన్ చేసేవాడిని.
ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంకు సెకండ్ హాఫ్ కారణం అని.. ఆ విషయం నన్ను ఇప్పటికి కూడా బాధ పెడుతుందని అనీల్ రావిపూడి ఆవేదన వ్యక్తం చేశాడు. తాను టైం కేటాయించలేక పోయినందున ఆగడు ఫ్లాప్ అయ్యిందని భావిస్తున్న అనీల్ రావిపూడి ఇప్పుడు మహేష్ కు సరిలేరు నీకెవ్వరు సినిమాతో సక్సెస్ ఇవ్వాలంటూ ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు. మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాను చేసిన అనీల్ రావిపూడి దాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం చేస్తున్నాడు.
వరుసగా సక్సెస్ లు దక్కించుకుంటున్న అనీల్ రావిపూడి ఈ ఏడాది సంక్రాంతికి ఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకున్నాడు. 2020 సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో సూపర్ హిట్ ను అందుకోబోతున్నాడు. మహేష్ బాబు తో పాటు లేడీ అమితాబ్ విజయశాంతి ఈ చిత్రంలో ఉండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇప్పటి వరకు పూర్తి కమర్షియల్ ఎంటర్ టైన్ మెంట్స్ ను అందించిన అనీల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు ను కూడా అదే విధంగా రూపొందించాడని పాటలు మరియు పోస్టర్ లు చూస్తుంటే అనిపిస్తుంది.