Begin typing your search above and press return to search.
'18పేజెస్' ఆ హీరోయిన్ కెరీర్ ని మారుస్తాయా?
By: Tupaki Desk | 23 April 2020 10:50 AM GMT2016లో నాని హీరోగా తెరకెక్కిన 'మజ్ను' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది మలయాళం బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్. మొదటి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత రాజ్ తరుణ్ తో కిట్టుగాడు జాగ్రత్త, గోపీచంద్ తో ఆక్సిజన్ లాంటి సినిమాలు చేసింది కానీ సక్సెస్ మాత్రం రాలేదు. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ హీరోగా 'అజ్ఞాతవాసి' లో హీరోయిన్ గా అవకాశం వచ్చింది కానీ ఆ సినిమా కూడా ప్లాప్ అయింది.
ఆ తర్వాత నాగచైతన్యతో శైలజారెడ్డి అల్లుడు, బన్నీతో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రాలు కూడా నిరాశపరిచాయి. ఆ తర్వాత అమ్మడు మళ్లీ సినిమాలలో కనపడలేదు. అయితే అను మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవ్వాలని చూస్తుందట. త్వరలో సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న '18 పేజెస్' అనే సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా ఎంపికైందని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట ఉప్పెన ఫేమ్ కృతిశెట్టిని ఎంపిక చేస్తున్నారని గతంలో వార్తలు వచ్చాయి.
ఇప్పుడు ఆ స్థానంలో అను ఇమ్మాన్యుయేల్ ని ఎంపిక చేశారని తెలుస్తోంది. కథ, పాత్ర పరంగా ఆమె అయితే చక్కగా సరిపోతుందని దర్శకనిర్మాతలు భావించారట. ఇంకా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కానీ అమ్మడు ఈ సినిమాతో అయినా సక్సెస్ అందుకుంటుందా? ఈ సినిమా అను కెరీర్ కి ఎలా ఉపయోగపడుతుంది అనేది పెద్ద ప్రశ్న. అందం అభినయం ఉన్నా హిట్లు లేని బ్యూటీ ఏం చేస్తుందో.. చూడాలి. ఇక ఈ సినిమాకి సుకుమార్ కథ - స్ర్కీన్ ప్లే అందిస్తుండగా - సుకుమార్ రైటింగ్స్ - గీతా ఆర్ట్స్ 2 కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.