Begin typing your search above and press return to search.
ఏప్రిల్ 28న పోకిరి సినిమా విజయోత్సవం!
By: Tupaki Desk | 17 March 2020 8:30 AM GMTపోకిరి. ఈ పదం వినగానే మనలో ఎక్కడలేని పాసిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. ఎందుకంటే తెలుగు సినీ చరిత్రలో పోకిరి సినిమా ప్రభంజనం అలాంటిది. 2006లో విడుదలైన ఈ సినిమా మొత్తం బాక్స్ ఆఫీస్ నే ఒక ఊపు ఊపేసింది. అప్పటి వరకు క్లాస్ హీరోగా పేరున్న మహేష్ బాబు ఒక్కసారిగా తనలో ఊరమాస్ యాంగిల్ కూడా ఉందని నిరూపించుకున్నాడు. ఈ సినిమాలో 'పండు' క్యారెక్టర్ లో మహేష్ డైలాగ్ డెలివరీ, మేనరిజం, యాక్షన్ అబ్బో.. అదరహో అనాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరోజు చాలదులెండి.
ఈ సినిమాను డైరెక్టర్ పూరిజగన్నాథ్ స్వయంగా నిర్మించి రూపొందించాడు. అటు డైరెక్టర్ గాను, ఇటు నిర్మాతగానూ విపరీతమైన క్రేజ్ తో అధిక మొత్తంలో లాభాలను కూడా గడించాడు. ఆయన రాసిన ఒక్కో సీన్, ఒక్కో డైలాగ్ సినీ అభిమానులను చప్పట్లు, విజిల్సు కొట్టేలా చేసాయి. ముఖ్యంగా "ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో.. ఆడే పండుగాడు, ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా బుల్లెట్టు దిగిందా లేదా, షెడ్డు బాగుంది కొట్టుకోవడానికి ఈ మాత్రం ఉండాలి" లాంటి డైలాగ్స్ అద్భుతాలే. నిజానికి ఈ సినిమానే ఒక అద్భుతం.
అయితే సోషల్ మీడియాలో గాని, సినీ ఇండస్ట్రీలో గాని మహేష్ బాబుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అందరికి తెలిసిందే. వచ్చే నెల ఏప్రిల్ 28కి పోకిరి సినిమా రిలీజై 14 సంవత్సరాలు కావస్తుండటంతో మహేష్ అభిమానులు పెద్ద ఎత్తున చిత్ర విజయోత్సవాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మరి ఆలోచన బాగానే ఉంది కానీ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి పర్మిషన్ ఇస్తుందా లేదా అనేది ఇప్పడు పెద్ద ప్రశ్న. ఏం జరుగుతుందో చూడాలి మరి! ఇన్నేళ్ళైనా పోకిరి సినిమా మత్తు వదలలేదు అంటే అర్ధం చేసుకోవచ్చు ఆ సినిమా ఇంపాక్ట్ ఇంకా ఏ రేంజ్ లో ఉందో..