Begin typing your search above and press return to search.

ఆయ‌న ప‌ర్య‌వేక్ష‌ణ‌లో బాల‌కృష్ణే డైరెక్ట‌ర్

By:  Tupaki Desk   |   30 April 2018 8:44 AM GMT
ఆయ‌న ప‌ర్య‌వేక్ష‌ణ‌లో బాల‌కృష్ణే డైరెక్ట‌ర్
X
తండ్రి తార‌క రాముడి బ‌యోపిక్ చిత్రాన్ని నంద‌మూరి బాల‌కృష్ణ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని తెర‌కెక్కించాల‌నుకున్నాడు. కానీ ఊహించ‌ని విధంగా డైరెక్ష‌న్ నుంచి త‌ప్పుకుని పెద్ద షాకే ఇచ్చాడు తేజ‌. తెలుగువారికి ఆరాధ్య న‌టుడైన సీనియర్ ఎన్‌.టీ.ఆర్ బ‌యోపిక్ తీసే బ‌రువైన బాధ్య‌త‌ను మోయ‌లేనంటూ హుందాగా డైరెక్ట‌ర్ ఛైర్ నుంచి త‌ప్పుకున్నాడు తేజ‌.

తేజ త‌ప్పుకోవ‌డంతో ఎన్.టీ.ఆర్ బ‌యోపిక్ సినిమాను ఎవ‌రు తీస్తారా... అని నంద‌మూరి అభిమానుల‌తో పాటు సినీ జ‌నాలంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. కృష్ణ‌వంశీ- బోయ‌పాటి శ్రీ‌ను- క్రిష్... ఇలా చాలామంది ద‌ర్శ‌కుల పేర్లే వినిపించాయి. అయితే కృష్ణ‌వంశీ త‌ప్ప మిగిలిన వారంతా సినిమాల‌తో బీజీగా ఉన్నారు. కృష్ణ‌వంశీ ఫామ్ చూస్తే ఇప్పుడు భ‌యంక‌రంగా ఉంది. దాంతో ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు చేతుల మీదుగానే ఎన్‌.టీ.ఆర్ బ‌యోపిక్ తెర‌కెక్కుతుంద‌నే అంద‌రూ భావించారు. ఈ చిత్ర ప్రారంభోత్స‌వం రాఘ‌వేంద్రుడు కూడా ఈ ర‌క‌మైన ఆస‌క్తిని... కోరిక‌నూ వెల్ల‌డించ‌డంతో ఆయ‌నే డైరెక్ష‌న్ చేప‌ట్ట‌బోతున్నాడ‌ని ఫిక్స్ అయిపోయారు కూడా. అయితే ఈ సినిమాకి ఆయ‌న కేవ‌లం ప‌ర్య‌వేక్ష‌ణ వ‌ర‌కే ప‌రిమితం కానున్నార‌ట‌. ఆయ‌న వెనకుండి న‌డిపిస్తుంటే... మెగా ఫోన్ చేతిలో ప‌ట్టుకుని స్వీయ‌ ద‌ర్శ‌క‌త్వం చేయాల‌ని డిసైడ్ అయ్యాడ‌ట నంద‌మూరి బాల‌కృష్ణ‌.

నంద‌మూరి తార‌క రాముడు స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్నో సినిమాలు చేశారు. కానీ ఆయ‌న కుమారులు మాత్రం ఆ టాలెంట్ నిరూపించుకోలేక‌పోయారు. బాల‌కృష్ణ ఇంత‌కుముందు న‌ర్త‌న‌శాల పేరుతో ఓ సినిమా రూపొందించాల‌నుకున్నారు. కానీ అది కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు ఆయ‌న మెగా ఫోన్ చేత‌బ‌ట్టి ద‌ర్శ‌క‌త్వం చేయ‌బోతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. అది కూడా ద‌ర్శకేంద్రుడి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో... చూడాలి ఎన్‌.టీ.ఆర్ బ‌యోపిక్ ఎవ‌రి చేతుల్లో ఎలా రాబోతుందో!