Begin typing your search above and press return to search.
బాలయ్య ఇప్పుడు ఆలోచించొచ్చు
By: Tupaki Desk | 9 Aug 2019 5:29 AM GMTగత కొద్దిరోజులుగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ ని బాలకృష్ణ హీరోగా రీమేక్ చేస్తారన్న వార్త కాస్త గట్టిగానే వినిపించింది. వాస్తవానికి చాలా సీరియస్ పాయింట్ చుట్టూ తిరిగే ఆ కథ స్టార్ హీరోలకు అంతగా సెట్ అవ్వదు. హిందిలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్ర ఆయన వయసు తగ్గట్టు డిజైన్ చేయడంతో బాగా పండింది. కాని మన సౌత్ స్టార్లకు కొన్ని లెక్కలు అభిమానుల అంచనాలు ఉంటాయి కాబట్టి వాటికి తగ్గట్టుగానే ఏ సబ్జెక్టు అయినా ప్లాన్ చేసుకోవాలి.
అందుకే పింక్ రీమేక్ బాలయ్యకు అంతగా వర్క్ అవుట్ కాదనే కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. కాని ఇప్పుడు పునరాలోచన చేసుకోవచ్చు. ఎందుకంటారా. కారణం ఉంది. పింక్ తమిళ్ రీమేక్ నీర్కొండ పార్వై నిన్న భారీ ఎత్తున రిలీజైంది. తెల్లవారకుండానే తమిళనాడు మొత్తం బెనిఫిట్ షోలతో షేక్ చేశారు. కట్ చేస్తే టాక్ ఎలా వస్తుందా అనే అనుమానాలు పటాపంచలు చేస్తూ అజిత్ నటించిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో పాటు అదిరిపోయే ఓపెనింగ్స్ తెచ్చింది.
ఒరిజినల్ వెర్షన్ కు కట్టుబడకుండా ఖాకీ ఫేం దర్శకుడు వినోత్ దీన్ని పర్ఫెక్ట్ కమర్షియల్ యాంగిల్ లో తీర్చిదిద్దాడు. సినిమా మొదలైన పది నిమిషాలకే హీరో ఎంట్రీ ఉండటం అజిత్ తో ఘోస్ట్ రైడర్ తరహాలో పవర్ ఫుల్ బైక్ చేజ్ పెట్టడం లాంటివి ఫ్యాన్స్ కి భలే కిక్ ఇచ్చాయి. ఇవన్ని హింది పింక్ లో లేవు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇలాంటి టెంపో మైంటైన్ చేస్తూ సెకండ్ హాఫ్ లో అసలు పాయింట్ ని చెప్పడంతో ఫైనల్ గా నీర్కొండ పార్వై పాస్ అయిపోయింది. సో బాలయ్య దీన్ని ఆప్షన్ గా పెట్టుకున్నా వర్క్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది