Begin typing your search above and press return to search.

తేడా వ‌చ్చిందో... మ‌హేష్‌ కు చుక్క‌లే

By:  Tupaki Desk   |   27 Jan 2018 3:22 PM IST
తేడా వ‌చ్చిందో... మ‌హేష్‌ కు చుక్క‌లే
X
సెలెబ్రిటీలు ఏం చేసినా కాస్త ఆచి తూచి చేయాలి. ముఖ్యంగా సామాజిక మాధ్య‌మాల్లో పోస్టుల విష‌యంలో మ‌రికొంచెం జాగ్ర‌త్త‌గా ఉండాలి. చూడండి... టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు ఎనిమిదేళ్ల క్రితం పెట్టిన ట్వీటు ఇప్ప‌టికీ అత‌డిని ఎలా వెంటాడుతోందో!

లీడ‌ర్ సినిమా గుర్తుందా. రానాను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ శేఖ‌ర్ క‌మ్ముల‌ తీసిన చిత్రం. ఆ సినిమా పెద్ద‌గా ఆడ‌లేదు. కానీ రానాకు - క‌మ్ముల‌కు మంచి పేరునే తెచ్చిపెట్టింది. ఆ స‌మ‌యంలో మ‌హేష్ బాబు ఓ ట్వీటు చేశాడు. తాను లీడర్ సినిమా డీవీడీ తెప్పించుకుని చూశాన‌ని, త‌న అభిప్రాయం ప్ర‌కారం... శేఖ‌ర్ క‌మ్ముల ఇంకా బాగా తీయ‌గ‌ల‌డ‌ని ఆ ట్వీటు అభిప్రాయం. అంటే ప‌రోక్షంగా సినిమా బాగోలేద‌ని కామెంట్ చేశాడ‌ని ప‌లువురు భావించారు. ఇప్పుడ‌దే ట్వీట్ మ‌హేష్‌ మెడ‌కు చుట్టుకునేలా క‌నిపిస్తోంది.

లీడ‌ర్‌లో రానా ముఖ్య‌మంత్రిగా న‌టించాడు... ఇప్పుడు భ‌ర‌త్ అను నేనులో కూడా మ‌హేష్‌ బాబు సీఎంగానే క‌నిపించ‌బోతున్నాడు. క‌నుక దాదాపు లీడ‌ర్ - భ‌ర‌త్ అను నేను సినిమాల మ‌ధ్య పోలిక రావ‌డం స‌హ‌జం. అప్ప‌ట్లో లీడ‌ర్ సినిమా గురించి కామెంట్ చేసిన మ‌హేష్‌... ఇప్పుడు భ‌ర‌త్ అనే నేను సినిమాతో హిట్ కొట్ట‌క‌పోతే ప‌రిస్థితేంటీ? సామాజిక మాధ్య‌మాల్లో అత‌డిని ఏకిపారేయం ఖాయం. భ‌ర‌త్ తో మ‌రో హిట్ ను త‌న ఖాతాలో వేసుకున్నాడ‌నుకోండీ... బతికిపోయిన‌ట్టే. లేదంటే... అప్పటి ట్వీట్‌కి ఇప్పుడు స‌మాధానం చెప్పుకోవాల్సి వ‌స్తుందేమో ప్రిన్స్.