Begin typing your search above and press return to search.

భీమ్లా ఎఫెక్ట్‌ ఓటీటీ సినిమాల రిలీజ్ పై పడిందా?

By:  Tupaki Desk   |   24 Feb 2022 10:41 AM GMT
భీమ్లా ఎఫెక్ట్‌ ఓటీటీ సినిమాల రిలీజ్ పై పడిందా?
X
పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భీమ్లా నాయక్ సినిమా కారణంగా పలు సినిమాలు వాయిదాలు పడ్డ విషయం తెల్సిందే. భీమ్లా నాయక్ తో పోటీ వద్దనుకున్ గని.. ఆడవాళ్లు మీకు జోహార్లు ఇంకా సెబాస్టియన్ సినిమాలు వాయిదా పడ్డాయి. థియేట్రికల్‌ రిలీజ్ మాత్రమే కాకుండా ఓటీటీ పై కూడా భీమ్లా నాయక్ ప్రభావం పడ్డట్లుగా అనిపిస్తుంది.

ప్రతి వారం ఈ మద్య కాలంలో ఓటీటీ లో డైరెక్ట్‌ సినిమా లు లేదా పోస్ట్‌ థియేట్రికల్‌ రిలీజ్ సినిమాలు ఏవో కొన్ని ఓటీటీ స్క్రీనింగ్ కు సిద్దం గా ఉంటాయి. కాని ఈ వారం మాత్రం చెప్పుకోదగ్గ సినిమాలే కాదు చిన్న సినిమాలు కూడా ఓటీటీ స్ట్రీమింగ్‌ కు సిద్దంగా లేవు. రేపు ఓటీటీ ప్రేక్షకులకు నిరాశ తప్పదు. భీమ్లా నాయక్ సినిమా విడుదల అవ్వడం వల్ల వారం మొత్తం ఆ సందడి ఉంటుంది. కనుక ఓటీటీ స్ట్రీమింగ్‌ వద్దని భావించి ఉంటారని సోషల్‌ మీడియా టాక్ వినిపిస్తుంది.

ఆహా ఓటీటీ లో రేపటి నుండి తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ షో ప్రారంభం కాబోతుంది. షో కు సంబంధించిన ప్రోమోలు మరియు పోస్టర్ లు షో పై ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ వారంలో ఓటీటీ లో ప్రేక్షకులు చడద్దగ షో కేవలం ఆ ఒక్కటే అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇతర ఓటీటీ లు కూడా పెద్ద రిలీజ్ లకు కూడా ఆసక్తి చూపడం లేదు.

ప్రతి వారం ఓటీటీ ద్వారా వినోదాన్ని కోరుకునే ప్రేక్షకులు ఈ వారంకు నిరాశ తప్పదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భీమ్లా నాయక్ సినిమా కోసం ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడా మొదటి వారం లోనే చూసేయాలని ఆశ పడుతున్నారు. కనుక ఓటీటీ సినిమాలు రాకపోవడం మంచిదనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.

గత రెండేళ్ల కాలంలో ఇండియాలో ఓటీటీ బిజినెస్‌ అనూహ్యంగా పెరిగింది. కరోనా కారణంగా థియేటర్లు మూత పడి ఉన్న సమయంలో పూర్తిగా ఓటీటీ లే ప్రేక్షకులకు ఎంటర్‌ టైన్మెంట్‌ ను అందించాయి. ఇప్పుడు అదే ఎంటర్‌ టైన్‌మెంట్‌ ను కొనసాగించేలా ఓటీటీ లు ప్లాన్‌ చేస్తున్నాయి.

తమ ఖాతాదారులను కంటిన్యూ చేసేలా మంచి సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లను అందిస్తున్నారు. దాంతో ఓటీటీ కి ప్రేక్షకులు బానిసలుగా మారిపోతున్నారంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ వీక్‌ లో ఓటీటీ సినిమాలు ఏమీ లేకపోవడంతో నిరాశ వ్యక్తం అవుతోంది.