Begin typing your search above and press return to search.
బోనీకపూర్ గ్రీన్ సిగ్నెల్ ఇస్తేనే జాన్వీ సౌత్ కి సై అందా?
By: Tupaki Desk | 27 July 2022 11:30 PM GMTఅతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. `ధడక్` తో పరిచయమైన జాన్వీ కెరీర్ ఉత్తరాదిన దేదీప్యమానంగా సాగిపోతుంది. స్టార్ హీరోలు సహా ఉమెన్ సెంట్రిక్ సినిమాల్లోనూ ఛాన్సులందుకుంటుంది. దీని వెనుక తండ్రి బోనీ కపూర్ కృషి ఎంతో ఉంది.
తండ్రి సూచనలు..సలహాలు పాటిస్తూనే ఇంత వరకూ రాగలిగింది. శ్రీదేవి తరహాలో జాన్వీని అగ్ర స్థాయి హీరోయిన్ గా చూడాలన్నది బోనీ కల. ఆ రకంగా జాన్వీ కెరీర్ విషయంలో తొలి నుంచి ఎంతో పకడ్భందీగా ముందుకు సాగుతుంది. జాన్వీ ప్రతీ విషయంలోనూ బోనీ కపూర్ ఉంటారు. కాగా జాన్వీ సౌత్ ఎంట్రీపై నెట్టింట ఎప్పటికప్పుడు రచ్చ జరుగుతూనే ఉంటుంది.
ఆ హీరోతో నటిస్తుందంట? ఈ డైరెక్టర్ పరిచయం చేస్తున్నాడంట? అని ప్రచారం తప్ప జాన్వీ ఇంత వరకూ సౌత్ సినిమా కమిట్ అయింది లేదు. సౌత్ ఎంట్రీపై పాజిటివ్ గా స్పందించిన సందర్భం ఉంది తప్ప! ఇప్పుడే లాంచ్ అవుతానని కరాఖండీగా చెప్పిన న సందర్భం లేదు. మరి ఈ విషయంలో జాన్వీ స్వరం మారిందా? సౌత్ సినిమాలపై పాజిటివ్ గా ఉందా? బోనీ కపూర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారా? అంటే జాన్వీ మాటల్లో అవన్నీ వాస్తవాలుగానే కనిపిస్తున్నాయి.
ఓ ఇంటర్వ్యూలో జాన్వీ దక్షిణాది సినిమాలో అగ్ర స్థానంలో ఉన్నాయని చెప్పుకొచ్చింది. సౌత్ ఇండియన్ సినిమా చేయాలన్న మనసులో కోర్కెని సైతం బయట పెట్టింది. సౌత్ దర్శకులు..హీరోలు ఎంతో కష్టపడతారని..అలాంటి వాళ్లతో పనిచేయడానికి ఎప్పడూ ముందుంటానని తెలిపింది. సౌత్ వర్సెస్ నార్త్ చర్చ నాకేంటే అర్ధం కావడం లేదని తెలిపింది.
``మేమంతా భారతదేశం కోసం మాత్రమే సినిమాలు చేస్తున్నాం. అన్ని భాషలు కలిపితేనే ఒక దేశం అంటూ బిన్నత్వంలో ఏకత్వం విధాన్ని గుర్తు చేసింది. జాన్వీ మాటల్ని బట్టి బోనీ కపూర్ కూడా సౌత్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసే ఉంటారని తెలుస్తోంది. సౌత్ సినిమాల విషయంలో జాన్వీ ఇంత పాజిటివ్ గా మాట్లాడింది లేదు.
తొలిసారి దక్షిణాదిపై ఆసక్తికర వ్యాఖ్యలతో హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ర్టీ ..బాలీవుడ్ కి పోటీగా దూసుకుపో తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బడా బడా స్టార్లే దిగొస్తున్నారు. మరి బోనీ కపూర్ మనసులో మాటేంటో? తెలియాలి.